ఖాళీ ప్లాట్లపై పన్ను వసూలేది? | - | Sakshi
Sakshi News home page

ఖాళీ ప్లాట్లపై పన్ను వసూలేది?

Oct 13 2026 1:47 AM | Updated on Oct 13 2026 1:47 AM

వసూలు చేయాలని ఆదేశాలు లేవు

భువనగిరి: జిల్లాలోని మున్సిపాలిటీల్లో ఖాళీ స్థలాలపై విధించే వేకెంట్‌ ల్యాండ్‌ టాక్స్‌ (వీఎల్‌టీ) వసూళ్లపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. పట్టణాలు విస్తరిస్తున్న కొద్దీ వందల సంఖ్యలో కొత్త ప్లాట్లు వెలుస్తున్నా, వాటిని గుర్తించి పన్ను పరిధిలోకి తీసుకురావడంలో మున్సిపల్‌ రెవెన్యూ విభాగం విఫలమవుతోందనే ఆరోపణలు వస్తున్నాయి. జిల్లాలోని భువనగిరి, చౌటుప్పల్‌, యాదగిరిగుట్ట, ఆలేరు, పోచంపల్లి, మోత్కూర్‌ మున్సిపాలిటీల్లోని ప్రధాన రహదారులు, కొత్త కాలనీలు, శివారు ప్రాంతాల్లో నిర్మాణాలు జరగని ఖాళీ ప్లాట్లు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. ఇవన్నీ వీఎల్‌టీ పరిధిలోకి వచ్చాయా? అసెస్‌మెంట్లు ఎన్ని ఉన్నాయి? అనే వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించే వారే కరువయ్యాడు.

0.5 శాతం వీఎల్‌టీ నిబంధన ఉన్నా..

తెలంగాణ మున్సిపాలిటీ యాక్ట్‌–2019 ప్రకారం నిర్మాణానికి అనువైన వ్యవసాయేతర ఖాళీ స్థలాలపై 0.5 శాతం వీఎల్‌టీ విధించాలనే నిబంధన ఉంది. ఖాళీ స్థలానికి సంబంధించి నిర్మాణం చేపట్టేటప్పుడు లేదా రిజిస్ట్రేషన్‌ సమయంలో ఈ పన్ను విధించే అవకాశం చట్టంలో పేర్కొన్నారు.

సమన్వయం లేక..

ఖాళీ స్థలాల పన్ను వసూలుకు ప్రత్యేక ఆన్‌లైన్‌ మాడ్యూల్‌ ఉన్నప్పటికీ, అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేయడం లేదు. రిజిస్ట్రేషన్‌ శాఖ వద్ద ఉండే ఆస్తి వివరాలను మున్సిపల్‌ వ్యవస్థతో సమన్వయం చేయకపోవడంతో అసెస్‌మెంట్‌లు పెరగడం లేదు. నోటీసులు జారీ చేయకపోవడంతో పాటు పాత అసెస్‌మెంట్లను నవీకరించకపోవడం వల్ల మున్సిపాలిటీలు రావాల్సిన భారీ ఆదాయాన్ని కోల్పోతున్నాయి. మరోవైపు వీఎల్‌టీతో సంబంధం లేకుండా కేవలం నాలా, లేదా ఎల్‌ఆర్‌ఎస్‌ ఆధారంగానే ప్లాట్ల రిజిస్ట్రేషన్లు జరిగిపోతున్నాయి.

ఫ మున్సిపాలిటీల్లో వీఎల్‌టీపై నిర్లక్ష్యం

ఫ భారీగా ఆదాయం కోల్పోతున్న పురపాలికలు

వేకెంట్‌ ల్యాండ్‌ ట్యాక్‌ వసూళ్లు 2020 నుంచి 2023 వరకు జరిగాయి. ఆ తర్వాత దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. దీంతో వీఎల్‌టీ పన్నులు వసూలు చేయడం లేదు.

– చంద్రప్రకాష్‌రెడ్డి,

మున్సిపల్‌ కమిషనర్‌, భువనగిరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement