భువనగిరి: పెండింగ్‌లో ఉన్న కేసుల దర్యాప్తులను వేగవంతం చేసి, త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా ఎస్పీ అంక్షాశ్‌యాదవ్ స్పష్టం చేశారు. సోమవారం భువనగిరి పట్టణంలోని డీఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో జిల్లా స్థాయి నెలవారీ క్రైమ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసుల ఛేదనలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా ఉపయోగించుకోవాలని, సాక్ష్యాధారాల సేకరణలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు. ప్రతి డివిజన్‌లో పెండింగ్ కేసుల పురోగతిపై డీఎస్పీలు సమీక్షా సమావేశాలు నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ లక్ష్మీనారాయణ, డీఎస్పీలు, సీఐలు, ఎస్‌హెచ్‌వోలు, ఎస్సైలు, టెక్నికల్ టీమ్, సీసీఎస్, సైబర్ క్రైమ్, డీసీఆర్‌బీ అధికారులు పాల్గొన్నారు.
అంకితభావంతో పనిచేస్తే గుర్తింపు
ప్రజల భద్రత కోసం అంకితభావంతో పనిచేస్తేనే తగిన గుర్తింపు లభిస్తుందని జిల్లా ఎస్పీ అక్షాంశ్ యాదవ్ అన్నారు. సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో, విధి నిర్వహణలో విశేష ప్రతిభ కనబర్చిన 120 మంది పోలీస్ సిబ్బందికి ఆయన ప్రశంసా పత్రాలను అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిజాయితీ, నిబద్ధత, వృత్తి నైపుణ్యంతో ప్రజలకు మెరుగైన సేవలందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఫ ఎస్పీ అంక్షాశ్‌యాదవ్


