ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రభుత్వ పనితీరుకు రెఫరెండం | - | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రభుత్వ పనితీరుకు రెఫరెండం

Oct 13 2026 1:47 AM | Updated on Oct 13 2026 1:47 AM

యాదగిరిగుట్ట రూరల్‌: ఖమ్మం–వరంగల్‌–నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రభుత్వ పనితీరుకు రెఫరెండంలా మారుతాయని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్‌ రెడ్డి అన్నారు. యాదగిరిగుట్ట మండలం వంగపల్లిలో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవడం ద్వారా బీఆర్‌ఎస్‌ జైత్రయాత్రప్రారంభిస్తామన్నారు. రాష్ట్రంలో ఈ ఎన్నికలు గీటురాయిగా మారుతాయని, ప్రతీ కార్యకర్త సైనికుడిలా పని చేయాలన్నారు. ప్రణాళికతో ముందుకెళ్తే భారీ మెజారిటీతో గెలుస్తామన్నారు. రాష్ట్రంలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు గెలిస్తే, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌ మళ్లీ సీఎం అవుతారని తెలిపారు. మాజీ విప్‌ గొంగిడి సునీత మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతీ ఓటును ఒడిసి పట్టాలన్నారు. తప్పకుండా ఈ సారి, బీఆర్‌ఎస్‌ పార్టీని గెలిపించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ తోటకూరి అనురాధ, మదర్‌ డెయిరీ మాజీ చైర్మన్‌ లింగాల శ్రీకర్‌ రెడ్డి, జెడ్పీ మాజీ కోఆప్షన్‌ మెంబర్‌ ఖలీల్‌, పాపట్ల నరహరి, మండల పార్టీ అధ్యక్షులు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement