నేడు మహాలయ అమావాస్య | - | Sakshi
Sakshi News home page

నేడు మహాలయ అమావాస్య

Oct 10 2026 1:40 AM | Updated on Oct 10 2026 1:40 AM

యాదగిరిగుట్ట : ప్రతి ఏడాది భాద్రపద మాసం కృష్ణ పక్షంలో పాడ్యమి నుంచి అమావాస్య వరకు ‘మహాలయ పక్షం’, ‘పితృపక్షం’ అని పిలుస్తారు. ఈ పక్షంలో ఆఖరి రోజైన అమావాస్యను ‘మహాలయ అమావాస్య’, ‘సర్వపితృ అమావాస్య’ అంటారు. శనివారం మహాలయ అమావాస్య రోజున పితృదేవతలకు తర్ఫణాలు, పిండ ప్రదానాలు చేస్తే మంచిదని యాదగిరి క్షేత్రం ప్రధానార్చకుడు కాండూరి వెంకటాచార్యులు తెలిపారు. గతించిన పూర్వీకులకు, కుటుంబంలో అకాల మరణం చెందిన వారికి ప్రతి సంవత్సరం శ్రాద్ధ తిథులను నిర్వహించడం కొందరికి వీలు కాకపోవచ్చని, అలాగే జాతకరీత్యా పితృదోషాలు ఉండవచ్చని పేర్కొన్నారు. అలాంటి వారు మహాలయ పక్షంలో శ్రార్థ కర్మలను నిర్వహించడం ద్వారా పితృదేవతల ఆశీస్సులు పొందుతారని, పితృదోషాల నుంచి విముక్తి పొందుతారని శాస్త్రవాక్యం చెబుతుందని చెప్పారు. మహాలయ పక్షంలో ప్రతిరోజూ ప్రత్యేకమైనదేనని, ఆయా రోజుల్లో నిర్వహించాల్సిన నిర్దేశిత కర్మలు ఉన్నాయని వివరించారు. ఆఖరి రోజైన అమావాస్యకు ఎంతో ప్రాధాన్యత ఉందని, తమ పూర్వీకులు మరణించిన తిథి తెలియనప్పుడు అమావాస్య నాడు పిండ ప్రదానాలు, తర్పణాలు నిర్వహిస్తే వారికి ఫలితాలు అందుతాయని తెలిపారు. బంధువులకు, స్నేహితులకు, బాగా కావలసిన వారికి కూడా మహాలయ పక్షంలో తర్పణాలు, పిండ ప్రదానాలు నిర్వహించవచ్చని పేర్కొన్నారు. అలాగే పేదలకు, ఆకలితో ఉన్న వారికి అన్నదానం చేయడం, పక్షులకు ప్రధానంగా కాకులకు, జంతువులకు ఆహారం పెట్టడం, పురోహితులకు స్వయం పాకాలు ఇవ్వడం శ్రేయస్కరమని, పితృదేవతలు సంతృప్తి చెందితేనే కుటుంబ వృద్ధి, ఆరోగ్యం, ఐశ్వర్యం కలుగుతాయని తెలిపారు.

ఫ మరణించిన వ్యక్తుల పేర్లతో దానాలు చేస్తే మంచిది

ఫ యాదగిరి క్షేత్రం ప్రధానార్చకుడు కాండూరి వెంకటాచార్యులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement