11న దశాబ్ది ఉత్సవాలు | - | Sakshi
Sakshi News home page

11న దశాబ్ది ఉత్సవాలు

Oct 10 2026 1:40 AM | Updated on Oct 10 2026 1:40 AM

ఫ బీఆర్‌ఎస్‌ నేతలు కంచర్ల రామకష్ణారెడ్డి, గొంగిడి సునీత వెల్లడి

సాక్షి యాదాద్రి : తెలంగాణలో నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, గ్రామ పంచాయతీల ఏర్పాటు జరిగి పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ నెల 11న జిల్లావ్యాప్తంగా దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకష్ణారెడ్డి, ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం భువనగిరిలోని బీఆర్‌ఎస్‌ జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సన్నాహక, మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. నాటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ వల్లే యాదాద్రి భువనగిరి జిల్లాతో పాటు మోత్కూరు, అడ్డగూడూరు మండలాలు, చౌటుప్పల్‌ డివిజన్‌ ఆవిర్భావించి నేడు సమగ్ర అభివృద్ధి సాధించాయన్నారు. ఈ నెల 11న ఉదయం 5:30 గంటలకు యాదగిరిగుట్టలో భారీ గిరి ప్రదక్షిణతో దశాబ్ది ఉత్సవాలు ప్రారంభమవుతాయని వెల్లడించారు. అనంతరం భువనగిరిలోని తెలంగాణ భవన్‌లో జరిగే వేడుకల్లో తెలంగాణ ఉద్యమకారులు, న్యాయవాదులు, జర్నలిస్టులు, కవులు, కళాకారులు, సాహితీవేత్తలను ఘనంగా సన్మానించనున్నట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా పరిషత్‌ మాజీ చైర్మన్‌ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు, ముఖ్య నేతలు గాదె నరేందర్‌రెడ్డి, కొలుపుల అమరేందర్‌, జిల్లా, మండల నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement