ఫ నేడు ఎంగిలిపూల బతుకమ్మతో సంబరాలు ప్రారంభం
భువనగిరి : ప్రకృతి ఆరాధనకు, సంస్కృతి, సంప్రదాయాలకు నిలువెత్తు రూపమైన బతుకమ్మ ఉత్సవాలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. తంగేడు, గునుగు, చామంతి, గులాబీ పట్టుకుచ్చుల వంటి రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి వాటి చుట్టూ చేరి ఏమేమి పూవొప్పునే గౌరమ్మ.. ఏమేమి కాయప్పునే గౌరమ్మ.. గుమ్మడి కాయప్పునే గౌరమ్మ... ఒక్కేసి పువ్వేసి చందమామ, ఒక రూపమాయే చందమామ అంటూ ఆడపడుచులు పాడే పాటలతో పల్లెలు, పట్టణాల్లో పండుగ శోభ సంతరించుకోనుంది.
తొమ్మిది రోజులు.. వివిధ పేర్లు
ఫ తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మ. ఫ రెండోరోజు అటుకుల బతుకమ్మ. ఫ మూడోరోజు ముద్దపప్పు బతుకమ్మగా కొలుస్తారు. ఫ నాలుగో రోజు బతుకమ్మను నాన బియ్యం బతుకమ్మ అని పిలుస్తారు. ఫ ఐదో రోజు అట్ల బతుకమ్మ అని పిలుస్తారు. ఫ ఆరో రోజు అలిగిన బతుకమ్మగా కొలుస్తారు.
ఫ ఏడో రోజు వేపకాయల బతుకమ్మ అని పిలుస్తారు.
ఫ ఎనిమిదో రోజు వెన్నముద్ద బతుకమ్మగా పిలుస్తారు.
ఫ తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ. కొన్నిచోట్ల పెద్ద బతుకమ్మ అని కూడా పిలుస్తారు. ఈ రోజు తల్లి బతుకమ్మ, పిల్ల బతుకమ్మ పేర్చుతారు.
భువనగిరిలో పూలు కొనుగోలు చేస్తున్న మహిళలు


