మదర్‌ డెయిరీలో తేలిన అక్రమాలు | - | Sakshi
Sakshi News home page

మదర్‌ డెయిరీలో తేలిన అక్రమాలు

Oct 10 2026 1:40 AM | Updated on Oct 10 2026 1:40 AM

సాక్షి, యాదాద్రి : మదర్‌ డెయిరీ సంస్థలో 2014 నుంచి 2024 వరకు దాదాపు రూ.9.75 కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు తేలింది. ఈ అక్రమాలపై ఏసీబీ, స్టేట్‌ కోఆపరేటివ్‌ అధికారులు విచారణ జరిపి 800 పేజీల నివేదికను ప్రభుత్వంతోపాటు మదర్‌ డెయిరీ ఎండీ, చైర్మన్‌ పాలకవర్గం, జిల్లా కలెక్టర్‌ అందజేశారు. ఈ నెల 9 నుంచి వచ్చేనెల 9వ తేదీలోపు ప్రత్యేక జనరల్‌ బాడీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అక్రమాలకు బాధ్యులైన మాజీ ఎండీలపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని, వారి నుంచి నిధులు రికవరీ చేయాలని నివేదికలో స్పష్టం చేశారు. డెయిరీలో అక్రమాలు జరిగాయని డైరెక్టర్‌ దొంతిరి సోమిరెడ్డి, చైర్మన్‌ గుడిపాటి మధుసూదన్‌రెడ్డి గతంలోనే రంగారెడ్డి జిల్లా డీసీఓకు ఫిర్యాదు చేయగా చర్యలకు సిఫార్సు చేశారు. ఈ అక్రమాల వ్యవహారంపై తదుపరి చర్యలకు డెయిరీ యంత్రాంగం సమగ్ర కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్టు సమాచారం.

ఫ రూ.9.75 కోట్ల నిధులు దుర్వినియోగం

ఫ బాధ్యులపై చర్యలకు సిఫార్సు చేసిన డీసీఓ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement