నిషేఽధిత జాబితాలో 3 లక్షల ఎకరాలు | - | Sakshi
Sakshi News home page

నిషేఽధిత జాబితాలో 3 లక్షల ఎకరాలు

Oct 9 2026 1:56 AM | Updated on Oct 9 2026 1:56 AM

● భువనగిరి మండలం కూనూరు గ్రామంలోని సర్వే నంబర్‌ 126లోని 167 గజాల స్థలానికి స్లాట్‌ బుక్‌ చేసుకున్నారు. ఆ భూమి ప్రభుత్వ భూమిగా, 22ఏ పరిధిలో ఉన్నట్లు రికార్డుల్లో ఉండటంతో ఫైల్‌ను కలెక్టరేట్‌లోని రెవెన్యూ అధికారులకు పంపారు. గతంలో ఇదే ప్లాట్‌కు రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్‌ ఉన్నప్పటికీ 22ఏలో ఉండటంతో ప్రస్తుత రిజిస్ట్రేషన్‌ నిలిచిపోయింది.

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : పట్టా భూములు కూడా 22ఏ నిషేధిత జాబితాలో చేరడంతో రైతులు, భూ యజమానులు గగ్గోలు పెడుతున్నారు. ఏళ్ల తరబడి పట్టా భూములుగా కొనసాగుతూ, సాగు చేసుకుంటున్న భూములు సైతం ప్రభుత్వ భూములుగా నమోదవడంతో ఆందోళన చెందుతున్నారు. తాతల కాలం నుంచి అనుభవిస్తున్న భూములు, గతంలో క్రయవిక్రయాలు జరిగిన స్థలాలు కూడా 22ఏ జాబి తాలోకి వెళ్లడంతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోతున్నాయి. తమ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలంటూ రైతులు తహసీల్దార్‌ కార్యాలయాలు, ఆర్డీ వో కార్యాలయాలు, కలెక్టరేట్‌ చుట్టూ తిరుగుతున్నారు.

ఇబ్బందుల్లో రైతులు

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 2.87 లక్షల ఎకరాలకుపైగా వ్యవసాయ భూములు 22ఏ పరిధిలోకి వెళ్లాయి. అంతేకాదు వ్యవసాయేతర భూములు పెద్ద సంఖ్యలో 22ఏ జాబితాలో ఉండటంతో సమస్య తీవ్రంగా మారింది. ప్రభుత్వం దరఖాస్తుల ద్వారా సమస్యలను పరిష్కరించుకునే అవకాశం కల్పించడంతో పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి. రికార్డులు, హక్కులు, సర్వే నంబర్లు, గతంలో జరిగిన రిజిస్ట్రేషన్లు తదితర అంశాలను అధికారులు పరిశీలించిన తర్వాతే భూమిని 22ఏ నుంచి తొలగింపునకు చర్యలు చేపడుతున్నా.. పెద్ద సంఖ్యలో తిరస్కరిస్తుండటంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు.

నల్లగొండలోనే 1.46 లక్షల ఎకరాలు

నల్లగొండ జిల్లాలోని 33 మండలాల పరిధిలో 1,46,936 ఎకరాల వ్యవసాయ భూములు 22ఏ జాబితాలో చేరినట్లు నమోదైనట్లు అధికారులు పేర్కొంటున్నారు. వీటిలో పట్టా భూములు కూడా ఉండటంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. సాగు చేసుకుంటున్న భూములను విక్రయించుకోవాలన్నా, అవసరానికి బ్యాంకు రుణం తీసుకోవాలన్నా, వారసత్వ బదలాయింపు చేసుకోవాలన్నా రికార్డుల్లో 22ఏ నిషేధిత జాబితా అడ్డంకిగా మారుతోంది. తమ భూములు పొరపాటున నిషేధిత జాబితాలో చేరాయని పేర్కొంటూ రైతులు రెవెన్యూ అధికారులను ఆశ్రయిస్తున్నారు. కొన్నిచోట్ల పరిశీలన అనంతరం తొలగింపులు జరుగుతున్నా.. అత్యధిక గ్రామాల్లో ఇంకా సమస్య పరిష్కారం కాకపోవడంతో భూ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నాన్‌ అగ్రికల్చర్‌లోనూ..

వ్యవసాయ భూములకే కాకుండా వ్యవసాయేతర భూములు, ఇళ్ల స్థలాలు కూడా 22ఏ జాబితాలో చేరాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో 22ఏలో ఉన్న భూముల రిజిస్ట్రేషన్ల కోసం 87 మంది జిల్లా రిజిస్ట్రార్‌కు దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో 42 దరఖాస్తులు పరిష్కరించి రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించగా 19 దరఖాస్తులు తిరస్కరించారు. మరో 26 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. భూమికి సంబంధించిన రికార్డులు, హక్కులు, సర్వే నంబర్లు తదితర అంశాలను అధికారులు పరిశీలించిన అనంతరం అన్నీ సక్రమంగా ఉన్నట్లు తేలితే 22ఏ నుంచి తొలగించి రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పిస్తున్నారు.

భువనగిరిలో 39,468 ఇళ్లు..

28,549 ఎకరాలు

యాదాద్రి భువనగిరి జిల్లాలో 39,468 ఇళ్లు, 28,549 ఎకరాల వ్యవసాయ భూములు 22ఏ నిషేధిత జాబితాలో చేరినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఇందులో కొన్నేళ్లుగా నివాసం ఉంటున్న ఇళ్లు, పట్టా భూములు కూడా ఉండటం గమనార్హం. 22ఏలో ఉన్న భూములకు రిజిస్ట్రేషన్‌ చేయాలంటే ముందుగా నిషేధిత జాబితా నుంచి తొలగించాలి. దీంతో భూ యజమానులు ముందుగా రెవెన్యూ అధికారులను ఆశ్రయించాల్సి వస్తోంది. రికార్డుల్లో చిన్నపాటి తేడా ఉన్నా దాని ప్రభావం రిజిస్ట్రేషన్‌పై పడుతోంది. తమ భూములు పట్టా భూములేనని పత్రాలు చూపిస్తున్నా.. రికార్డుల్లో 22ఏగా నమోదై ఉండటంతో సమస్య ఎదురవుతోందని రైతులు వాపోతున్నారు.

ఫ పట్టా భూములు సైతం 22ఏ లోకి..

ఫ ఒక్క నల్లగొండలోనే లక్షన్నర ఎకరాలు

ఫ మిగతా రెండు జిల్లాల్లో మరో లక్షన్నర ఎకరాలపై నిషేధం

ఫ ఆందోళన చెందుతున్న రైతులు, ప్రజలు

ఫ నిషేధిత జాబితా నుంచి తొలగించాలని రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement