ఎస్‌ఏ–1 నిర్వహణ తీరు పరిశీలన | - | Sakshi
Sakshi News home page

ఎస్‌ఏ–1 నిర్వహణ తీరు పరిశీలన

Oct 9 2026 1:56 AM | Updated on Oct 9 2026 1:56 AM

భువనగిరి: జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో కొనసాగుతున్న ఎస్‌ఏ–1ను ప్రత్యేకంగా నియమించిన తనిఖీ బృందం పరిశీలించింది. 9వ తరగతి ఎస్‌ఏ–1లో మాస్‌కాపీయింగ్‌ శీర్షికన గురువారం సాక్షి దిన పత్రికలో ప్రచురితమైన కథనానికి విద్యాశాఖ అధికారులు స్పందించి తనిఖీ బృందాన్ని ఏర్పాటు చేశారు. బృందంలోని అధికారులు డీసీఈబీ పాండు, ఏసీజీఈ శ్రీనివాస్‌, సెక్టోరియల్‌ అధికారులు టి. శ్రీహరిఅయ్యంగార్‌, పి. లింగారెడ్డి, డీసీఈబీ అసిస్టెంట్‌ సెక్రటరీ బి. రమేష్‌లు భువనగిరి, వలిగొండ, ఆలేరు, బొమ్మలరామారం, రాజాపేట, చౌటుప్పల్‌ మండలాల్లోని పాఠశాలల్లో పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించారు. అలాగే 9వ తరగతి పరీక్షల సమాధాన పత్రాల మూల్యాంకనం చేస్తున్న కేంద్రాలను తనిఖీ చేశారు.

నవంబర్‌ 15న లక్ష మంది రైతులతో మహా ప్రదర్శన

చౌటుప్పల్‌ : నవంబర్‌ 15నుంచి 18వ తేదీ వరకు నల్లగొండలో ఏఐకేఎస్‌ 36వ మహాసభలను నిర్వహిస్తున్నామని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి తీగల సాగర్‌ తెలిపారు. స్థానిక రంగారెడ్డి స్మారక భవనంలో గురువారం నిర్వహించిన తెలంగాణ రైతు సంఘం జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తిని దేశవ్యాప్తంగా రైతాంగ ఉద్యమాలకు చాటిచెప్పే లక్ష్యంతో ఈ మహాసభలను నల్లగొండలో నిర్వహిస్తున్నామన్నారు. అందులో భాగంగా నవంబర్‌ 15న లక్షమంది రైతులతో మహాప్రదర్శన నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు బొంతల చంద్రారెడ్డి, ఎం.డి.జహంగీర్‌, జిల్లా అధ్యక్షుడు మేక అశోక్‌రెడ్డి, కార్యదర్శి మాటూరు బాలరాజు, బూరుగు కృష్ణారెడ్డి, కోట రామచంద్రారెడ్డి, చీరిక అలివేలు, యాదిరెడ్డి, విజయభాస్కర్‌, సంజీవరెడ్డి, నర్సిరెడ్డి, శ్రీనివాసరెడ్డి, శ్రీశైలం, ధర్మయ్య, శ్రీను, బుచ్చిరెడ్డి, మల్లేశం పాల్గొన్నారు.

క్షయ రహిత సమాజ నిర్మాణం అందరి బాధ్యత

భువనగిరి: క్షయ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ మనోహర్‌ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన టీబీ ముక్త్‌ భారత్‌ అభియాన్‌లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. టీబీకి సంబంధించిన అన్ని రకాల పరీక్షలను ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా నిర్వహిస్తున్నామన్నారు. అలాగే వ్యాధి నిర్ధారణ అయిన వారికి చికిత్స పూర్తయ్యే వరకు ప్రతి నెలా రూ. 1000 ఇవ్వనున్నట్లు తెలిపారు. జిల్లాలోని 427 గ్రామ పంచాయతీలకు గాను 46 గ్రామాలను టీబీ రహితంగాతీర్చిదిద్దారు. వీటి కోసం కృషి చేసిన ప్రజాప్రతినిధులు, వైద్య సిబ్బందికి ప్రశంస పత్రాలను అందజేసి, సన్మానించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ తంగళ్లపల్లి శ్రీవాణిరవికుమార్‌, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అవెజ్‌చిస్తీ, ఎన్‌సీసీ కో ఆర్డినేటర్‌ ప్రసాద్‌, డాక్టర్‌ వంశీ కృష్ణ, డాక్టర్‌ రామకృష్ణ, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ సుమన్‌కళ్యాణ్‌, యూత్‌ నేతలు కరుణ్‌ పాల్గొన్నారు.

యాదగిరీశుడి క్షేత్రంలో నిత్యపూజలు

యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం నిత్య పూజలు విశేషంగా నిర్వహించారు. ఉదయాన్నే శ్రీస్వామి అమ్మవార్లకు సుప్రభాత సేవ చేపట్టారు. వేద మంత్రాలతో గర్భాలయంలోని స్వయంభూ మూర్తులకు, బంగారు ప్రతిష్ఠా అలంకార మూర్తులకు అభిషేకం జరిపించి, తులసీ దళాలతో అర్చన, సహన్రనామార్చన, కుంకుమార్చన చేశారు. ఇక ముఖ మండపంలోని ఉత్సవమూర్తుల చెంత అష్టోత్తరం, సువర్ణ పుష్పార్చన పూజలు జరిపారు. ప్రథమ ప్రాకార మండపంలో పాంచరాత్ర ఆగమశాస్త్రానుసారంగా శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి పూజ నిర్వహించారు. సాయయంత్రం జోడు సేవ, రాత్రి ద్వార బంధనం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement