యాదగిరిగుట్ట: ఢిల్లీలో ప్రతిపక్ష నాయకులపై పోలీసుల చర్యలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. ఢిల్లీలో ఓటు చోరీపై నిరసన తెలిపిన లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ, ఎంపీ ప్రియాంకగాంధీలతో పాటు ప్రతిపక్ష ఎంపీలను అరెస్టు చేసిన ఘటనపై గురువారం యాదగిరిగుట్ట పట్టణంలో బ్లాక్ డేగా పాటిస్తూ నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం సీఈసీ జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సమయంలో పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అనంతరం ఐలయ్య మాట్లాడుతూ, ఓటు చోరీకి ప్రధాన బాధ్యుడైన సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ను ప్రధాని నరేంద్రమోదీ వెనకేసుకొస్తున్నాడని ఆరోపించారు. ప్రధాని మోదీని గద్దె దింపేంత వరకు కాంగ్రెస్ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ గుండ్లపల్లి వాణి భరత్‌గౌడ్, వైస్ చైర్‌పర్సన్ రమ్య, పట్టణ అధ్యక్షుడు ముక్కెర్ల మల్లేష్ యాదవ్, మాజీ అధ్యక్షులు గుండ్లపల్లి భరత్‌గౌడ్, బందారపు భిక్షపతి, మాజీ ధర్మకర్త పెలిమెల్లి శ్రీధర్‌గౌడ్, నాయకులు కాటబత్తిని ఆంజనేయులు, నువ్వుల రమేష్, గుండు నర్సింహ, కలకుంట్ల శేఖర్, బిట్టు హరీష్, కానుగు బాలరాజు, బూడిద భాస్కర్, ఎర్రగుంట్ల శేఖర్, ఉత్తేజ్, గుడ్ల నరేష్, ముక్కెర్ల వెంకటేష్, కోల కృష్ణ, యాకూబ్, బండారు హరిప్రసాద్ పాల్గొన్నారు.


