వరి వద్దు.. ఆరుతడే ముద్దు | - | Sakshi
Sakshi News home page

వరి వద్దు.. ఆరుతడే ముద్దు

Oct 8 2026 3:54 AM | Updated on Oct 8 2026 3:54 AM

ఆరుడడి పంటలను ఎంచుకోవాలి

యాసంగిలో పంటల సాగు అంచనా విస్తీర్ణం (ఎకరాల్లో)

వరి: 2,07,354

పండ్లు,

కూరగాయలు 5,600

పెసర్లు 5,410

మినుములు 3,560

పశుగ్రాసం 3,680

వేరుశనగ 1,675

జొన్న 1,540

శనగలు 1,200

పొద్దుతిరుగుడు 1,020

నువ్వులు 1,010

మొక్కజొన్న 950

ఆముదం 174

బొబ్బర్లు 171

కందులు 55

ఇతర పంటలు 3,680

రామన్నపేట: ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో భూగర్భజలాలు అడుగంటిపోయాయి. చెరువులు, కుంటలు ఎండిపోగా, మూసీ కాలువల్లో సైతం నీటి ప్రవాహం తగ్గింది. ఈ నేపథ్యంలో యాసంగి సీజన్‌లో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడే ప్రమాదం ఉండటంతో, రైతులను సన్నద్ధం చేసేందుకు వ్యవసాయ శాఖ ముమ్మర కసరత్తు ప్రారంభించింది.

వరి జోలికి వెళ్లకుండా..

ఎక్కువ నీరు అవసరమయ్యే వరి పంట జోలికి వెళ్లకుండా, తక్కువ నీటితోనే పండే ఆరుతడి పంటలను సాగు చేయాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. రైతులను చైతన్యపరిచేందుకు వాట్సాప్‌ గ్రూపులు, సోషల్‌ మీడియా వేదికలతో పాటు విత్తనాలు, ఎరువుల దుకాణాల ద్వారా విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు.

సిద్ధమైన యాసంగి ప్రణాళిక

వరదలు, సాగునీటి కొరత అంచనాలను దృష్టిలో ఉంచుకొని వ్యవసాయ శాఖ రబీ యాక్షన్‌ ప్లాన్‌ను సిద్ధం చేసింది. గత రబీ సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా 3,46,454 ఎకరాల్లో వరి సాగు కాగా, ఈసారి సాగు విస్తీర్ణం 2,07,354 ఎకరాలకు పరిమితమయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు. అంటే సుమారు 1,39,100 ఎకరాల్లో వరి సాగు తగ్గనుంది.

వర్షాభావ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని రైతులు ఎక్కువ నీరు అవసరమయ్యే పంటల జోలికి వెళ్లకూడదు. తక్కువ కాలంలో, తక్కువ నీటితో పండే ఆరుతడి పంటలను సాగు చేయాలి. – వెంకటరమణారెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి

ఫ యాసంగి యాక్షన్‌ప్లాన్‌ సిద్ధం

ఫ ఎల్‌నినోతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు

ఫ అడుగంటిన భూగర్భ జలాలు.. ఎండిన చెరువులు, కుంటలు

ఫ ఆరుతడి పంటల వైపే మొగ్గు చూపాలని వ్యవసాయ శాఖ పిలుపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement