దళితుల అభ్యున్నతికి పాటుపడాలి | - | Sakshi
Sakshi News home page

దళితుల అభ్యున్నతికి పాటుపడాలి

Oct 8 2026 3:54 AM | Updated on Oct 8 2026 3:54 AM

రాజాపేట : దళితుల అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య, ఉన్నత విద్యా మండలి వైస్‌ చైర్మన్‌ ఇటికాల పురుషోత్తం పిలుపునిచ్చారు. బుధవారం రాజాపేట మండల కేంద్రంలో దళిత ప్రజా ప్రతినిధుల సన్మాన కార్యక్రమాన్ని దళిత ఉపకులాల సన్మాన కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. మండల పరిధిలోని దళిత సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, ప్రజా ప్రతినిధులను శాలువాలతో ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళితులంతా సమష్టిగా హక్కుల సాధనకు పోరాడాలని కోరారు. అంతకు ముందు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘం నాయకులు పాల్గొన్నారు.

పాడి రైతులు జాగ్రత్తలు పాటించాలి

ఆత్మకూరు(ఎం): పాడి పశువుల పెంపకంలో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని పశు వైద్యాధికారి గిరి సూచించారు. ఆత్మకూరు(ఎం) మండలంలోని పలు గ్రామాల్లో పాడి పశువులు లంపీ స్కిన్‌ వ్యాధికి గురై రైతులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ఈ నెల 6న్ఙపాడి పశువులపై ‘లంపీ పంజా’ అనే శీర్షిక కథనం ప్రచురితం అయింది. దీనికి స్పందించిన పశు వైద్యాధికారులు రహీంఖాన్‌పేటలో లంపీ స్కిన్‌ వ్యాధి సోకిన లేగదూడను పరిశీలించి రైతు తాల్లపెల్లి నర్సయ్యతో మాట్లాడారు. మందులు అందచేశారు. ఆయన వెంట వీఎల్‌ఓ సత్యనారాయణ, గోపాల మిత్ర బండారు సురేష్‌, అటెండర్‌ గణేష్‌ ఉన్నారు.

యాదగిరి క్షేత్రంలో నిత్య కల్యాణం

యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆయలంలో నిత్య కల్యాణ వేడుకను పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారం జరిపించారు. బుధవారం ఉదయం సుప్రభాత సేవ చేపట్టారు. అనంతరం గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, సహస్ర నామార్చన, కుంకుమార్చన జరిపించారు. ముఖ మండపంలోని సువర్ణ ఉత్సవమూర్తులకు అష్టోత్తర పూజలు నిర్వహించారు. ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణ వేడుక, బ్రహ్మోత్సవం వంటి పూజలు చేపట్టారు. సాయంత్రం వేళ జోడు సేవను తిరు, మాడ వీధుల్లో ఊరేగించారు. రాత్రి శ్రీస్వామి వారికి శయనోత్సవం జరిపించి, ఆలయాన్ని ద్వారబంధనం చేశారు.

క్షయ రహిత గ్రామంగా ఖైతాపురం

చౌటుప్పల్‌ : చౌటుప్పల్‌ మండలంఖైతాపురం క్షయ రహిత గ్రామంగా ఎంపికై ంది. కేంద్రం చేపట్టిన టీబీ ముక్త్‌ భారత్‌ కార్యక్రమంలో భాగంగా క్షయ రహిత గ్రామంగా ఎంపిక చేశారు. ఈమేరకు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు పంచాయతీ పాలకవర్గం, ఆరోగ్య సిబ్బంది సమన్వయంతో పనిచేసి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంతో ఈ గుర్తింపు దక్కిందని సర్పంచ్‌ రామలింగేశ్వర్‌రెడ్డి తెలిపారు. గురువారం భువనగిరిలో అవార్డు అందుకోనున్నట్టు ఆయన చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement