సాక్షి యాదాద్రి : ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం దేశ నిర్మాణానికి, ప్రజల విశ్వాసానికి నిలువెత్తు నిదర్శనమని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం భువనగిరి పట్టణంలోని బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఊట్కూరు అశోక్ గౌడ్ అధ్యక్షతన సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహించారు. ఈ సందర్భంగా వికసిత్ భారత్ సంకల్ప సభతో పాటు పట్టణంలో భారీ సేవా జ్యోతి యాత్ర చేపట్టారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల అశోక్‌తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మోదీ ప్రత్యక్ష ప్రసంగాన్ని కార్యకర్తలతో కలిసి వీక్షించారు. కాసం మాట్లాడుతూ మోదీ జీవితం దేశ సేవకే అంకితమైందని కొనియాడారు. జాతి ప్రయోజనాల కోసం విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్న ధీశాలి మోదీ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు పాశం భాస్కర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏలే చంద్రశేఖర్, తుమ్మల మురళీధర్ రెడ్డి, మాయ దశరథ, జిల్లా ఉపాధ్యక్షులు జైనపల్లి శ్యాంసుందర్ రెడ్డి, పట్నం శ్రీనివాస్, గూడూరు నరోత్తం రెడ్డి, ప్రధాన కార్యదర్శులు కొప్పుల యాదిరెడ్డి, చందా మహేందర్ గుప్తా, కాదురాచ్చయ్య, కార్యదర్శులు కామిటికారి కృష్ణ, వైజయంతి, మేడి కోటేష్, మీడియా కన్వీనర్ ఆకుతోట రామకృష్ణ, కార్యాలయ కార్యదర్శి మంగు నరసింహారావు, పట్టణ అధ్యక్షుడు రత్నపురం బలరాం, యువమోర్చా జిల్లా అధ్యక్షుడు దయ్యాల కుమార్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు మాధురి చంద్ర, నేతలు దాసరి మల్లేశం, పడమటి జగన్మోహన్ రెడ్డి, సుర్వి శ్రీనివాస్, సుదగాని ఉదయ్, రాళ్లబండి కష్ణచారి, వంగేటి సుచరిత, స్వర్ణలత, యాస్మిన్ తదితరులు పాల్గొన్నారు.
ఫ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు


