సాక్షి,యాదాద్రి : జిల్లాలో మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక నిఘా ఉంచాలని కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో మత్తు పదార్థాల నిరోధక విభాగంపై నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడారు. పారిశ్రామిక వాడలు, కంపెనీలపై దృష్టిపెట్టాలన్నారు. యువత చెడు వ్యసనాల బారిన పడకుండా కళాశాలలు, గ్రామాలు, పట్టణాల్లో చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఎస్పీ అక్షాంశ్‌యాదవ్ మాట్లాడుతూ కర్మాగారాల్లో పనిచేసే కార్మికులపై నిఘా ఉంచాలని, విద్యాసంస్థల్లో విద్యార్థులకు అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా ఎకై ్సజ్ అధికారి తుక్యా నాయక్, జిల్లా సంక్షేమ అధికారి శ్రీనివాస్ పాల్గొన్నారు.
ప్రధానోపాధ్యాయులు ప్రధాన
పాత్రపోషించాలి
భువనగిరి: పాఠశాలల సమగ్ర అభివృద్ధిలో ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓలు ప్రధాన పాత్ర పోషించాలని కలెక్టర్ అనురాగ్‌జయంతి సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లో ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఎఫ్‌ఎల్‌ఎన్‌లో ప్రగతి సాధించడానికి ప్రతి పాఠశాలల స్టడీ అవర్ ప్రారంభించాలన్నారు. అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థుల హాజరుతో పాటు ఇతర విషయాలలో జిల్లాను ఉన్నత స్థానంలో నిలుపాలన్నారు. సమావేశంలో డీఈఓ భిక్షపతి, జెడ్పీ డిప్యూటీ సీఈఓ సీహెచ్ శ్రీనివాస్, జిల్లా కామన్‌పరీక్షల బోర్డు అధికారి పాండునాయక్, ప్రభుత్వ పరీక్షల విభాగం అదనపు కార్యదర్శి జె. శ్రీనివాస్, సెక్టోరియల్ అధికారులు ఎన్. అండాలు, శ్రీహరి అయ్యంగార్, పెసరు లింగారెడ్డి,, జానీ ఆప్ఘన్, నరహరి, డీఎస్‌ఓ రాజశేఖర్, స్కౌట్స్ అధికారి శ్రీధర్, పాఠ్యపుస్తకాల సహశాఖాధికారి బుస్సా రమేష్, ఎఫ్‌ఎల్‌ఎన్ రాష్ట్ర బాధ్యులు కావ్య, చందన పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ అనురాగ్ జయంతి


