చివరిరోజు హోరెత్తిన ప్రచారం | - | Sakshi
Sakshi News home page

చివరిరోజు హోరెత్తిన ప్రచారం

Oct 8 2026 3:54 AM | Updated on Oct 8 2026 3:54 AM

యాదగిరిగుట్ట: ఆర్టీసీలో కార్మికుల గుర్తింపు సంఘం ఎన్నికల్లో భాగంగా వారం రోజులుగా సాగుతున్న ప్రచారం బుధవారం సాయంత్రం ముగిసింది. చివరి రోజు ఐఎన్‌టీయూసీ అనుబంధంగా ఉన్న టీడబ్ల్యూయూ, ఎస్‌డబ్ల్యూఎఫ్‌ ఐక్య కూటమి అభ్యర్థులను గెలిపించాలని ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య ప్రచారం చేశారు. అభ్యర్థులు వీఎస్‌రావు బాణం గుర్తుకు, మొగుళ్ళ రాజిరెడ్డి నక్షత్రం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఐలయ్య కోరారు. ఈ ప్రచారంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గుండ్లపల్లి వాణి, కానుగు బాలరాజుగౌడ్‌, గున్న ప్రభాకర్‌రెడ్డి, మార్త కృష్ణయ్య, యాదప్ప, ఎ.ప్రవీణ్‌, ఏపీ రెడ్డి, నర్సింగ్‌రావు తదితరులున్నారు. ఎంప్లాయీస్‌ యూనియన్‌ (ఈయూ), టీఎంయూ, ఎన్‌ఎంయూ కూటమి అభ్యర్థులను గెలిపించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్‌రెడ్డి గుట్ట డిపోలో ప్రచారం నిర్వహించారు. బస్సు, నిచ్చెన గుర్తులకు ఓట్లు వేసి కూటమి అభ్యర్ధులకు మద్దతుగా నిలవాలన్నారు. ఈ కార్యక్రమంలో కురుమిద్ద శ్రీనివాస్‌, బోలగాని సత్యనారాయణ, ఎండీ ఇమ్రాన్‌, కళ్లెం కృష్ణ, చెక్క వెంకటేష్‌, కొల్లూరు రాజయ్య, పేరబోయిన మహేందర్‌, సోకం వెంకన్న, వేముల సోమేష్‌,సురేందర్‌, ప్రవీణ్‌, రమేష్‌, జాల నర్సింహ తదితరులున్నారు. బీఎంఎస్‌ (కార్మిక్‌ సంఘ్‌), టీజేఎంయూ నాయకులు ..ఓటర్లను కలిసి తమకు ఓటు వేయాలని వేడుకున్నారు.

ఫ రేపటి ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement