బాధ్యతాయుతంగా సామాజిక కార్యక్రమాలు చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

బాధ్యతాయుతంగా సామాజిక కార్యక్రమాలు చేపట్టాలి

Oct 8 2026 3:54 AM | Updated on Oct 8 2026 3:54 AM

నల్లగొండ టూటౌన్‌ : బాధ్యతాయుతంగా సామాజిక కార్యక్రమాలు చేపట్టి విద్యార్థుల్లో సేవాతత్పరత, సమగ్రత, దేశభక్తిని పెంపొందించాలని ఎన్‌ఎస్‌ఎస్‌ డిప్యూటీ స్టేట్‌ ఆఫీసర్‌ నరసింహగౌడ్‌ అన్నారు. ఆయన బుధవారం నల్లగొండలోని ఎంజీ యూనివర్సిటీలో జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సన్నాహక సమావేశంలో మాట్లాడారు. నషాముక్త్‌ భారత్‌పై 100 రోజుల సమరానికి పూర్తిస్థాయి కార్యాచరణ, ప్రతి నెల రిపోర్టుల సమర్పణ, గ్రామాలలో ప్రత్యేక శిబిరాల నిర్వహణపై వివరించారు. ఎన్‌ఎస్‌ఎస్‌ బ్యాంకు అకౌంట్ల సమగ్ర నిర్వహణపై ఆయన చర్చించారు. ఈ సమావేశంలో రమణారెడ్డి, వై. వివేకానందరెడ్డి, షరీఫ్‌, రామచంద్రుడు, కిరణ్‌, ఆనంద్‌, శ్రీనివాస్‌, వెంకటేశ్వర్లు, కోటయ్య పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement