రాజాపేటలో నిరుపేద కుటుంబాలకు తోచిన సాయం అందించాలనే ఉద్ధేశంతోనే జైశ్రీరామ్ ఫౌండేషన్ ఏర్పాటు చేశాం. ఇప్పటివరకు మా ఫౌండేషన్‌తో పాటు ప్రజల సహకారంతో మొత్తంగా రూ.15లక్షల వరకు ఆర్థికసాయం అందజేశాం. మున్ముందు కూడా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తాం.
– కోయ మధు, జైశ్రీరామ్
ఫౌండేషన్ నిర్వాహకుడు
కష్టాల్లో ఉన్న నిరుపేదలను ఆదుకోవాలనేదే మా ఫౌండేషన్ ముఖ్య లక్ష్యం. రాజాపేట గ్రామంలో ఎవరైనా ఆపదలో ఉన్నారని తెలిస్తే చాలు.. వారికి ఆర్థిక సాయం చేయడం మాకు అలవాటుగా మారింది. దాతలు సహాయం చేసినన్ని రోజులు ఈ కార్యక్రమాలను ఇలాగే కొనసాగిస్తూనే ఉంటాం.
– గాండ్ల నర్సింగరావు, ఫౌండేషన్ సభ్యుడు


