క్యాంపస్ సమాచారం
ఎంజీయూలో క్రాస్ కంట్రీ పరుగు పందెం పోటీలు
నల్లగొండ టూటౌన్ : మహాత్మాగాంధీ యూనివర్సిటీ (ఎంజీయూ), క్లౌడెలీ సంస్థల మధ్య విద్యా–పరిశ్రమ అనుసంధానానికి సంబంధించి అవగాహన ఒప్పందం బుధవారం యూనివర్సిటీలో వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. విద్యార్థుల్లో పరిశ్రమకు అవసరమైన నైపుణ్యాలు, ప్రాక్టికల్ నాలెడ్జ్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, అగ్రిటెక్, మార్కెటింగ్, సాఫ్ట్ స్కిల్స్ తదితర రంగాల్లో శిక్షణ, ప్రాజెక్ట్ ఆధారిత అభ్యసనం, పరిశ్రమ అనుభవాన్ని పెంపొందించడమే అవగాహన ఒప్పంద ముఖ్య ఉద్ధేశమన్నారు. ఈ ఒప్పందం ద్వారా విద్యార్థులకు శిక్షణ, వర్క్‌షాప్‌లు, మెంటరింగ్, ప్రాజెక్ట్ ఆధారిత అభ్యసనం, పరిశ్రమ పరస్పర చర్యలు, ఇంటర్న్‌షిప్, ప్లేస్‌మెంట్–రెడీనెస్‌కు సంబంధించిన అవకాశాలను అందుకునేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ కె. అంజిరెడ్డి, ఐక్యూఏసీ డైరెక్టర్ మిర్యాల రమేష్, ప్రిన్సిపాల్ కె. హరీష్‌కుమార్, రేఖ, వై. నాగరాజు, జ్యోతిరాణి పాల్గొన్నారు.
నల్లగొండ టూటౌన్ : నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో బుధవారం నిర్వహించిన అంతర్ కళాశాలల 10 కిలోమీటర్ల క్రాస్ కంట్రీ పరుగు పందెం పోటీలను రిజిస్ట్రార్ కొప్పుల అంజిరెడ్డి ప్రారంభించారు. ఈ పోటీల్లో మహిళల విభాగంలో భువనగిరిలోని ఆర్మీ డిగ్రీ కళాశాల విజేతగా నిలవగా.. రెండో స్థానంలో దేవరకొండలోని ట్రైబల్ వెల్ఫేర్ డిగ్రీ కళాశాల నిలిచింది. పురుషుల విభాగంలో ఎంజీయూ కామర్స్ బిజినెస్ మేనేజ్‌మెంట్ కళాశాల విద్యార్థులు మొదటి స్థానం సాధించగా.. గోపాలకృష్ణ వ్యాయామ కళాశాల రెండో స్థానంలో నిలిచింది. రిజిస్ట్రార్ అంజిరెడ్డి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ మద్దిలేటి, అంతర్ కళాశాలల మహిళల ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆర్. మురళి, పురుషుల ఆర్గనైజింగ్ సెక్రటరీ వై. శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.


