రాజాపేట : మానవ సేవే.. మాధవ సేవ అని భావిస్తూ రాజాపేట మండల కేంద్రానికి చెందిన యువకులు ఆపదలో ఉన్నవారికి ఆపద్బాంధవులుగా మారుతున్నారు. 2019లో ఏర్పాటు చేసిన జైశ్రీరామ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేదలు, బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తూ అండగా నిలుస్తున్నారు. 2019లో 25 మంది యువకులు ఓ వాట్సాప్ గ్రూపుగా ఏర్పడి ఈ ఫౌండేషన్‌ను ప్రారంభించారు. 2020 కరోనా విపత్కర సమయంలో ప్రజలకు కూరగాయలు, నిత్యావసర సరుకులు, మాస్కులు, శానిటైజర్లు అందించడం ద్వారా సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత పార్టీలకతీతంగా యువకులు ఒక్కొక్కరుగా చేరడంతో ప్రస్తుతం సభ్యుల సంఖ్య 134కు చేరింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు రాజాపేటలో ఎవరైనా ఆపదలో ఉంటే వైద్య ఖర్చుల కోసం ఆర్థిక సాయం చేస్తూ భరోసా కల్పిస్తున్నారు. ప్రమాదాలు, అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నిరుపేదలకు సాయం చేయడంతో పాటు.. అనాథ వృద్ధులను ఆశ్రమాల్లో చేర్పించడం, దహన సంస్కారాలకు నిధులు అందించడం, రక్తదానాలు చేయడం, ఇల్లు లేని పేదలకు గూడు నిర్మించి ఇవ్వడం లాంటి సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నారు.
చేయూత ఇలా..
గ్రామంలో ఏ నిరుపేద కుటుంబానికై నా ఆపద వచ్చిందంటే ఫౌండేషన్ నిర్వాహకులు వెంటనే స్పందిస్తారు. సామాజిక మాధ్యమాల్లో జైశ్రీరామ్ ఫౌండేషన్ వాట్సాప్ నంబర్‌ను షేర్ చేసి దాతల నుంచి విరాళాలు సేకరిస్తారు. తగినంత నిధి ఏర్పడగానే ఆ మొత్తాన్ని బాధిత కుటుంబానికి అందించి ధైర్యం కల్పిస్తారు. ఈ క్రమంలో రాజాపేటలో మరణించిన 190 మంది నిరుపేదల కుటుంబాలకు రూ.5వేల చొప్పున మొత్తం రూ.9.50లక్షల ఆర్థిక సాయం అందించారు. మరికొన్ని సందర్భాల్లో ప్రజలను కూడా భాగస్వాములను చేసి మరో 10 మందికి రూ.10వేల నుంచి రూ.35వేల వరకు సాయం అందజేశారు.
ఫ వాట్సాప్ గ్రూప్‌గా ఏర్పడి
విస్తృత సేవలు
ఫ బాధిత కుటుంబాలకు
రూ.15 లక్షల ఆర్థిక సాయం


