భూమికి బలం జీవామృతం | - | Sakshi
Sakshi News home page

భూమికి బలం జీవామృతం

Oct 8 2026 3:54 AM | Updated on Oct 8 2026 3:54 AM

నడిగూడెం : వివిధ పంటల సాగులో మోతాదుకు మించి రసాయన మందుల వాడకంతో భూసారం దెబ్బతింటోంది. ఈ నేపథ్యంలో భూసారం పెరిగి అధిక దిగుబడులు సాధించాలంటే ప్రకృతి వ్యవసాయ పితామహుడు సుభాష్‌ పాలేకర్‌ రూపొందించిన జీవామృతం ఉపయోగించడం మేలని నడిగూడెం మండల వ్యవసాయాధికారి గోలి మల్సూర్‌ సూచిస్తున్నారు. జీవామృతం తయారీ విధానం, ఉపయోగించే పద్ధతులు ఆయన మాటల్లోనే..

జీవామృతం తయారీకి కావాల్సిన పదార్థాలు

దేశీ ఆవుపేడ 10 కిలోలు, దేశీ ఆవు మూత్రం 5 నుంచి 10 లీటర్లు, బెల్లం 2 కిలోలు, ద్విదళ పప్పుల పండి 2 కిలోలు, బావి లేదా బోరు నీరు 200 లీటర్లు, పిడికెడు పొలం గట్టు మట్టి లేదా పుట్ట మట్టి కావాల్సి ఉంటుంది.

తయారీవిధానం..

ఎండ తగలని చోట పెట్టిన సిమెంట్‌ తొట్టి లేదా ప్లాస్టిక్‌ డ్రమ్ములో 200 లీటర్ల నీటిని నింపాలి. పేడ, మూత్రం, బెల్లం, పిండి తదితరాలను అందులో వేసి, బాగా కలపాలి. గడియారం ముల్లు తిరిగే దిశలో అంటే సవ్య దిశలో కర్రతో కలియతిప్పాలి. గోనె సంచి కప్పాలి. ఉదయం ఒక నిమిషం, సాయంత్రం ఒక నిమిషం కలియదిప్పాలి. అందులోని సూక్ష్మజీవరాశి ప్రతి 20 నిమిషాలకోసారి రెట్టింపు అవుతూ ఉంటుంది. 48 గంటల తర్వాత వాడకానికి జీవామృతం సిద్ధమవుతుంది. అప్పటి నుంచి తర్వాత వారం రోజుల్లోగా ఉపయోగించాలి. ఎకరానికి 200 లీటర్ల జీవామృతాన్ని ప్రతి 15 రోజులకు ఒకసారి నీటితోపాటు పిచికారీ చేయాలి. లేదా భూమిలో పదునుంటే నేరుగా చల్లాలి. జీవామృతం అన్ని పంటలకు, పొలాల్లోనూ వాడవచ్చు.

ఉపయోగం ఇలా..

● జీవామృతం వినియోగం వల్ల పంటల్లో అద్భుతమైన ఫలితాలు వస్తున్నప్పటికీ జీవామృతం పంటలకు లేదా చెట్లకు ఆహారం మాత్రం కాదు.

● ఇది అనంతకోటి సూక్ష్మజీవులతో కూడిన మహాసాగరం లాంటిది.

● ఈ సూక్ష్మజీవులు భూమిలో మొక్కల వేర్లు పోషకాలను వినియోగించుకునే రీతిలో మార్చి అందుబాటులోకి తెస్తాయి.

● ఆవు వేసిన 1 గ్రాము పేడలో 300 నుండి 500 కోట్ల సూక్ష్మజీవులు ఉంటాయి. అంటే 10 కిలోల పేడలో 30 లక్షల కోట్ల నుంచి 50 లక్షల కోట్ల సూక్ష్మజీవుల వరకు వృద్ధి చెందుతాయి.

● జీవామృతంలో 10 కిలోల పేడ కలిపిన తర్వాత ప్రతి 20 నిమిషాలకు వీటి సంఖ్య రెట్టింపు అవుతుంది.

● జీవామృతాన్ని తయారు చేసిన 2 రోజుల వరకు పులియపెట్టినప్పుడు వాటి సంఖ్య లెక్కకు అందనంతగా పెరుగుతుంది.

● ఎప్పుడైతే నీటిలో గానీ, తడి నేలపైగానీ జీవామృతాన్ని పోస్తామో అప్పుడు అవి భూమిలోని పోషకాలను వేర్లు ఉపయోగించుకునే రూపంలోకి మార్చు పనిని ప్రారంభిస్తాయి.

● జీవామృతాన్ని భూమిలో పోసిన వెంటనే భూమిలో 10–15 అడుగుల లోతులో ఉన్న వానపాములు చైతన్యమవుతాయి. చురుకుగా పనిచేయడం ప్రారంభిస్తాయి.

ఫ భూసారం పెంపునకు

ప్రకృతి వ్యవసాయం మేలు

ఫ రైతులకు నడిగూడెం

ఏఓ మల్సూర్‌ సూచన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement