దసరాకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు | - | Sakshi
Sakshi News home page

దసరాకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

Oct 8 2026 3:54 AM | Updated on Oct 8 2026 3:54 AM

రామగిరి(నల్లగొండ): దసరా పండుగ సందర్భంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలకు టీజీఎస్‌ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. పండుగ వేళ హైదరాబాద్‌ నుంచి స్వగ్రామాలకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం, అలాగే తిరుగు ప్రయాణాల కోసం ఆర్టీసీ నల్లగొండ రీజియన్‌ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ వివరాలను నల్లగొండ రీజినల్‌ మేనేజర్‌ టీ. జోత్స్న బుధవారం వెల్లడించారు. రీజియన్‌ పరిధిలోని 7 డిపోల నుంచి ప్రతిరోజూ 80 ప్రత్యేక బస్సుల ద్వారా మొత్తం 160 అదనపు ట్రిప్పులను ఆపరేట్‌ చేస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రత్యేక బస్సులు ఈ నెల 10 నుంచి 21వ తేదీ వరకు నిరంతరాయంగా అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. హైదరాబాద్‌ నుంచి నల్లగొండ, సూర్యాపేట, మిర్యాలగూడ, దేవరకొండ, కోదాడ, యాదగిరిగుట్టలకు వెళ్లే ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

డిపోల వారీగా ప్రత్యేక బస్సులు ఇలా..

సూర్యాపేట డిపో నుంచి 20, దేవరకొండ 14,

మిర్యాలగూడ 12, యాదగిరిగుట్ట 12,

కోదాడ డిపో నుంచి 10, నల్లగొండ 8,

నార్కట్‌పల్లి నుంచి 4 బస్సులు నడపనున్నారు.

రెండు బైక్‌లు ఢీ..

నలుగురికి గాయాలు

యాదగిరిగుట్ట రూరల్‌(మోటకొండూర్‌) : రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొనడంతో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మోటకొండూర్‌ మండలం ముత్తిరెడ్డిగూడెంలో బుధవారం రాత్రి జరిగింది. ఎస్‌ఐ కుమారస్వామి తెలిపిన వివరాల ప్రకారం.. నార్కట్‌పల్లి మండలం అక్కెనపల్లి గ్రామానికి చెందిన మర్రి మధు, వలిగొండ మండలం వేములకొండ వెంకటాపూర్‌ గ్రామానికి చెందిన కంబాలపల్లి సుజాత బైక్‌పై రాయిగిరి నుంచి ముత్తిరెడ్డిగూడెం వస్తున్నారు. అదేవిధంగా భువనగిరికి చెందిన అనపర్తి ఉపేందర్‌, కట్ట ఉదయ్‌కుమార్‌ మరో బైక్‌పై ముత్తిరెడ్డిగూడెం నుంచి భువనగిరి వైపు వెళ్తున్నారు. ఈ రెండు బైక్‌లు ముత్తిరెడ్డిగూడెం లక్ష్మీ వైన్స్‌ వద్ద ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. నలుగురిని అంబులెన్స్‌లో భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

అంగన్‌వాడీ టీచర్‌ అదృశ్యం

భువనగిరి(బీబీనగర్‌) : బీబీనగర్‌కు చెందిన అంగన్‌వాడీ టీచర్‌ హైమావతి అదృశ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 1వ తేదీన హైమావతి అంగన్‌వాడీ సెంటర్‌కు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయల్దేరింది. సాయంత్రం వరకు ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆమె ఆచూకీ లభించలేదు. దీంతో బుధవారం ఆమె కుమారుడు సందీప్‌ బీబీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సూర్యనాయక్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement