పోషకాహారం సక్రమంగా అందేలా చూడాలి | - | Sakshi
Sakshi News home page

పోషకాహారం సక్రమంగా అందేలా చూడాలి

Oct 7 2026 2:10 AM | Updated on Oct 7 2026 2:10 AM

భువనగిరిటౌన్‌ : అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పోషకాహారం సక్రమంగా అందేలా చూడాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి సూచించారు. మంగళవారం భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని న్యూ రాంనగర్‌ కాలనీలో గల అంగన్‌వాడీ కేంద్రాన్ని కలెక్టర్‌ తనిఖీ చేశారు. కేంద్రంలో నమోదైన చిన్నారులు, గర్భిణులు, బాలింతల వివరాలు, వారి రోజువారీ హాజరును అడిగి తెలుసుకున్నారు. గర్భిణులకు అందిస్తున్న గుడ్లు, పాలు, పప్పుధాన్యాలు తదితర పోషకాహారాన్ని పరిశీలించి, అర్హులైన ప్రతి ఒక్కరికీ సకాలంలో నాణ్యమైన ఆహారం అందించాలని ఆదేశించారు. న్యూరాంనగర్‌ అంగన్‌ వాడీ కేంద్రానికి సొంత భవనం నిర్మించాలని, కమ్యూనిటీ హాల్‌ పైభాగంలో స్థలం అందుబాటులో ఉందని కార్యకర్త అనురాధ కలెక్టర్‌కు విన్నవించగా, వెంటనే ప్రతిపాదనలు సమర్పించాలని ఆదేశించారు. ఎస్‌ఐఆర్‌ సర్వే విధుల్లో ఉపాధ్యాయులు పాల్గొంటున్న వేళ, ప్రీ–స్కూల్‌ పిల్లలకు టీచర్‌ రావడం లేదని కేంద్రాలకు వెళ్లామని అంటున్నట్లు లబ్ధిదారులకు కలెక్టర్‌ దృష్టికి తీసుకొచ్చారు. ఇబ్బంది కలగకుండా బీఎడ్‌ పూర్తి చేసిన కొందరు తల్లులు స్వచ్ఛందంగా తరగతులు నిర్వహిస్తుండటంపై కలెక్టర్‌ అభినందించారు.

ఫ కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement