పత్తి సాగును పరిశీలించిన అధికారులు | - | Sakshi
Sakshi News home page

పత్తి సాగును పరిశీలించిన అధికారులు

Oct 7 2026 2:10 AM | Updated on Oct 7 2026 2:10 AM

మోత్కూరు : మండలంలోని రాగిబావి, పాలడుగు గ్రామాల్లో కపాస్‌ కాంతి–మిషన్‌ ఫర్‌ కాటన్‌ ప్రొడక్టివిటీ(ఎంసీపీ) కార్యక్రమం కింద చేపట్టిన క్లోజర్‌ స్పేసింగ్‌ విధానంలో సాగుచేస్తున్న పత్తి పంటను అధికారులు మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పాలడుగులో రైతులు మిడిదొడ్డి భిక్షం, బర్ల రవీందర్‌రెడ్డి, బరిగెల సూర్యనారాయణ, ఎం. ఉపేష్‌, ఎం. స్వాతి, కె. స్వాతి సాగు చేస్తున్న పత్తి పంటలను రాగిబావిలో మెండు సత్తిరెడ్డి, కరుణాకర్‌, జయమ్మ దామోదరరెడ్డి చేన్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మొక్కల సాంద్రత, ఎరువుల యాజమాన్యం, కలుపు నివారణ, చీడపీడల నియంత్రణ, పంట ఆరోగ్యం, సమగ్ర పంట యాజమాన్య పద్ధతులపై రైతులకు సూచనలు చేశారు. క్లోజర్‌ స్పేసింగ్‌ విధానంతో వనరులను సమర్థంగా వినియోగించుకొని పత్తి ఉత్పాదకతను పెంచుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఓసీడీ నాగ్‌పూర్‌ సీనియర్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌ ప్రియాంక అగర్వాల్‌, జిల్లా వ్యవసాయ అధికారి పుణ్యాల వెంకటరమణారెడ్డి, ఆలేరు ఏడీఏ కె. నిర్మల, మోత్కూరు ఏఓ వి. కీర్తి, ఏఈఓలు ఆర్‌. సింహప్రసాద్‌, జి. సోమప్ప, జి. కళ్యాణి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement