ఇంట్లోకి ప్రవేశించిన 12 అడుగుల కొండచిలువ | - | Sakshi
Sakshi News home page

ఇంట్లోకి ప్రవేశించిన 12 అడుగుల కొండచిలువ

Oct 7 2026 2:10 AM | Updated on Oct 7 2026 2:10 AM

యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలోని యాదగిరిపల్లి శివారులో మైలార్‌గూడెం వెళ్లే దారిలో గల రాచకొండ రాజు ఇంట్లోకి మంగళవారం రాత్రి భారీ కొండ చిలువ ప్రవేశించింది. రాత్రి 9.45గంటల ప్రాంతంలో రాజు కుటుంబ సభ్యులు పక్కన ఇంట్లోకి వెళ్లారు. ఆ సమయంలో సుమారు 12 అడుగులున్న భారీ కొండచిలువ ఇంట్లోకి వెళ్లడాన్ని రాజు ఇంటి ముందు ఉన్న మరో వ్యక్తి చూసి వారికి సమాచారం ఇచ్చారు. దీంతో రాజు కుటుంబ సభ్యులు ఇంటి ముందుకు వెళ్లి చూసేసరికి కొండచిలువ ఇంట్లో తలుపు ముందు కనిపించింది. ఆందోళనకు గురైన రాజు కుటుంబ సభ్యులు వెంటనే భువనగిరిలో పాములు పట్టుకునే వ్యక్తులకు ఫోన్‌ చేసి పిలిపించగా.. వారు కొండచిలువను బంధించి అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో అటవీ ప్రాంతంలో వదిలేందుకు తీసుకెళ్లారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement