డిండి ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద ఊడిపోయిన రాళ్లను గుర్తించి వెంటనే మరమ్మతులు చేపట్టాలి. ప్రాజెక్టు నిర్వహణపై సంబంధిత అధికారుల పర్యవేక్షణ పూర్తిగా కరువైంది. భవిష్యత్తులో వరద ఉధృతి ఎక్కువగా ఉంటే భారీగా నష్టం జరిగే అవకాశం ఉంది.
– ఎండీ మైనొద్దీన్, సీపీఐ రైతు సంఘం
నల్లగొండ జిల్లా అధ్యక్షుడు
పట్టించుకోకపోతే ప్రమాదమే
మండల కేంద్రంలోని డిండి ప్రాజెక్టు వద్ద నెలకొన్న సమస్యలపై ఇరిగేషన్ అధికారులు నిఘా ఉంచి, ఎప్పటికప్పుడు అవసరమైన మరమ్మతులు చేపట్టాలి. గత కొన్నేళ్లుగా స్పిల్‌వే కిందిభాగాన మరమ్మతులు చేయలేదు. వెంటనే స్పందించకపోతే భవిష్యత్తులో ప్రాజెక్టుకే ప్రమాదం.
– జంగయ్య, రైతు, ఎర్రారం


