చికిత్స పొందుతూ బాలుడు మృతి | - | Sakshi
Sakshi News home page

చికిత్స పొందుతూ బాలుడు మృతి

Oct 7 2026 2:10 AM | Updated on Oct 7 2026 2:10 AM

దేవరకొండ(చింతపల్లి) : రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. చింతపల్లి మండలం రోటిగడ్డతండాకు చెందిన నేనావత్‌ రాజు కుమారుడు ముకేష్‌(15), నేనావత్‌ పొద కుమారుడు శ్రీరామ్‌(15) సోమవారం ద్విచక్ర వాహనంపై తక్కళ్లపల్లి వైపు వెళ్తుండగా.. రోటిగడ్డతండా పరిధిలోనే ఇస్లావత్‌ బాలోజీ అనే వ్యక్తి అజాగ్రత్తగా, అతివేగంగా ట్రాక్టర్‌పై వస్తూ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ముఖేష్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. గాయాలపాలైన శ్రీరామ్‌ను స్థానికులు మాల్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. ముఖేష్‌ తండ్రి రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ముత్యాల రామ్మూర్తి తెలిపారు.

స్టార్టర్‌ బాక్స్‌లలోని

మాగ్నెట్‌ కాయిల్స్‌ చోరీ

సూర్యాపేట(ఆత్మకూర్‌.ఎస్‌): ఆత్మకూర్‌(ఎస్‌) మండలం గట్టికల్‌ గ్రామంలో రైతుల వ్యవసాయ బావుల వద్ద స్టార్టర్‌ బాక్స్‌లలోని మాగ్నెట్‌ కాయిల్స్‌ను కొద్దిరోజులుగా గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేస్తున్నారు. వారం క్రితం ఎరక్రుంట చెరువు సమీపంలో సుమారు 15 మంది రైతుల స్టార్టర్‌ పెట్టెలలోని మాగ్నెట్‌ కాయిల్‌లను దొంగిలించారు. సోమవారం రాత్రి ఇదే గ్రామంలో మరో 20 మంది రైతులకు చెందిన మాగ్నెట్‌ కాయిల్‌లను దొంగిలించారు. మండలంలోని పలు గ్రామాల్లో సైతం ఇదే తరహాలో చోరీలు జరుగుతున్నట్లు సమాచారం. పోలీసులు నిఘా పెట్టి దొంగలను పట్టుకోవాలని రైతులు కోరుతున్నారు.

ఈతకు వెళ్లి బాలుడు మృతి

దేవరకొండ(చింతపల్లి) : కుంటలో ఈతకు వెళ్లిన బాలుడు నీటిలో మునిగి మృతిచెందాడు. ఈ ఘటన చింతపల్లి మండలం హరిజనపురం గ్రామంలో మంగళవారం జరిగింది. పోలీసులు, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. హరిజనపురం గ్రామానికి చెందిన కంబాలపల్లి అబ్బమ్మ, ఎల్లయ్య దంపతుల కుమారుడు శివశంకర్‌(9) స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాడు. రోజుమాదిరిగానే మంగళవారం కూడా శివశంకర్‌ పాఠశాలకు వెళ్లాడు. సాయంత్రం 4గంటల సమయంలో పాఠశాల వదిలిన తర్వాత శివశంకర్‌ తన స్నేహితులతో కలిసి స్థానిక దోవయ్యదొర కుంటలో ఈతకు వెళల్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ఊపిరాడక మృతిచెందాడు. మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ముత్యాల రామ్మూర్తి తెలిపారు.

జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ జామ్‌

చౌటుప్పల్‌ : విజయవాడ–హైదరాబాద్‌ జాతీయ రహదారిపై చౌటుప్పల్‌ మండల పరిధిలో మంగళవారం ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. బొర్రోళ్లగూడెం గ్రామ స్టేజీ వద్ద విజయవాడ మార్గంలో హైవేపై తారు పనులు చేపట్టారు. దీంతో ఆ మార్గంలో కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ జామ్‌ అవ్వడంతో వాహనాలు నిదానంగా ముందుకు సాగాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement