ప్రమాదవశాత్తు ఇంట్లో అగ్ని ప్రమాదం | - | Sakshi
Sakshi News home page

ప్రమాదవశాత్తు ఇంట్లో అగ్ని ప్రమాదం

Oct 7 2026 2:10 AM | Updated on Oct 7 2026 2:10 AM

ఫ రూ.5వేల నగదు, విలువైన

డాక్యుమెంట్లు దగ్ధం

మోత్కూరు : మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని కొండగడప గ్రామంలో మంగళవారం ఓ ఇంట్లో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో నగదు, విలువైన డాక్యుమెంట్లు దగ్ధమయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకా రం.. కొండగడప గ్రామానికి చెందిన అన్నందాసు లక్ష్మి మంగళవారం ఉదయం ఇంట్లో దేవుడికి దీపం వెలిగించి అనంతరం ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లింది. కొద్దిసేపటికే ఆమె ఇంట్లో మంటలు చెలరేగినట్లు స్థానికులు తెలిపారు. మంటలు వేగంగా వ్యాపించడంతో దుస్తులు, గృహోపకరణాలతో పాటు బీరువాలో ఉంచిన రూ.5వేల నగదు, భూమికి సంబంధించిన పట్టాదారు పాసుపుస్తకం, ప్లాట్లకు సంబంధించిన డాక్యుమెంట్లు కాలిబూడిదైనట్లు బాధితురాలు పేర్కొంది. సుమారు రూ.లక్ష ఆస్తి నష్టం జరిగిందని ఆమె చెబుతున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది సుమారు గంట పాటు శ్రమించి మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు.

ఆటో దొంగిలించిన

వ్యక్తి అరెస్ట్‌

సూర్యాపేట(ఆత్మకూర్‌.ఎస్‌) : ఆటో దొంగిలించిన వ్యక్తిని ఆత్మకూర్‌(ఎస్‌) పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. ఎస్‌ఐ ఐలయ్య తెలిపిన వివరాల ప్రకారం.. ఆత్మకూర్‌(ఎస్‌) మండల పరిధి లోని కోటినాయక్‌ తండాకు చెందిన ధరావత్‌ ప్రవీణ్‌కుమార్‌ ఆగస్టు 30న రాత్రి తన ఆటోను ఇంటి ముందు పార్కింగ్‌ చేశాడు. మరుసటిరోజు ఉదయం చూసేసరికి ఆటో కనిపించలేదు. దీంతో బాధితుడు స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, మంగళవారం ఆత్మకూర్‌ క్రాస్‌ రోడ్డు వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా వెళ్తున్న ఆటోను ఆపి డ్రైవర్‌ను విచారించినట్లు ఎస్‌ఐ తెలిపారు. డ్రైవర్‌ వరంగల్‌ జిల్లా సంగెం మండలం గవిచర్ల గ్రామానికి చెందిన రాయపూరి రాజుగా గుర్తించామని, కోటినాయక్‌ తండాలో ఆటోను దొంగిలించింది తానేనని అతడు ఒప్పుకున్నాడని ఎస్‌ఐ పేర్కొన్నారు. ఆటోను స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement