ఎదురెదుగా రెండు బైక్‌లు ఢీ.. | - | Sakshi
Sakshi News home page

ఎదురెదుగా రెండు బైక్‌లు ఢీ..

Oct 7 2026 2:10 AM | Updated on Oct 7 2026 2:10 AM

దేవరకొండ(చందంపేట) : రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతిచెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన దేవరకొండ మండలం మడమడక గ్రామ స్టేజీ సమీపంలో మంగళవారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నేరెడుగొమ్ము మండలం పెద్దమునిగల్‌ గ్రామానికి చెందిన యాద అంజయ్య(55) తన భార్య వాణితో కలిసి ద్విచక్ర వాహనంపై దేవరకొండ నుంచి స్వగ్రామానికి వెళ్తున్నాడు. అదేవిధంగా చందంపేట మండలం పోలేపల్లి గ్రామానికి చెందిన నోముల కోటేష్‌(30) అదే గ్రామానికి చెందిన కావటి అనిల్‌తో కలిసి ద్విచక్ర వాహనంపై దేవరకొండకు వెళ్తున్నారు. దేవరకొండ మండలం మడమడక గ్రామ స్టేజీ సమీపంలో ఈ రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో అంజయ్య, కోటేష్‌ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందారు. అంజయ్య భార్య వాణికి, మరో బైక్‌పై ఉన్న అనిల్‌కు కూడా గాయాలయ్యాయి. వాణి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆమెను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అనిల్‌ను దేవరకొండలోని ప్రైవేటఆస్పత్రికి తరలించారు. మృతుడు కోటేష్‌ డీసీఎం డ్రైవర్‌గా పనిచేస్తుండగా.. అతడికి భార్య, ఐదేళ్ల చిన్నారి, నాలుగేళ్ల కుమారుడు ఉన్నారు. మరో మృతుడు అంజయ్య పెద్దమునిగల్‌ గ్రామంలో కిరాణ దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు దేవరకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఎస్‌ఐ నారాయణరెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.

ఫ ఇద్దరు దుర్మరణం

ఫ మరొకరి పరిస్థితి విషమం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement