ఫ ఎంజీయూ రిజిస్ట్రార్ కొప్పుల అంజిరెడ్డి
నల్లగొండ టూటౌన్ : క్రీడలతో మానసిక ప్రశాంతత చేకూరుతుందని మహత్మాగాంధీ యూనివర్సిటీ రిజిస్ట్రార్ కొప్పుల అంజిరెడ్డి అన్నారు. ఎంజీయూ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డు ఆధ్వర్యంలో మంగళవారం అంతర్ కళాశాలల హ్యాండ్ బాల్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు నిత్యం క్రీడల్లో శిక్షణ పొందడం ద్వారా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ మారం వెంకటరమణారెడ్డి, బోర్డు కార్యదర్శి పసుపుల మద్దిలేటి పాల్గొన్నారు.


