కౌన్సిల్‌ సమావేశాలు విజయవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

కౌన్సిల్‌ సమావేశాలు విజయవంతం చేయాలి

Oct 7 2026 2:10 AM | Updated on Oct 7 2026 2:10 AM

నల్లగొండ : నల్లగొండలో ఈ నెల 15, 16 తేదీల్లో నిర్వహించనున్న పీఆర్టీయూ రాష్ట్ర కౌన్సిల్‌ సమావేశాలను విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి కోరారు. మంగళవారం నల్లగొండలోని పీఆర్టీయూ భవన్‌లో సంఘం జిల్లా అధ్యక్షుడు కాళం నారాయణరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని జిల్లాల నుంచి సుమారు 8వేల మంది పీఆర్టీయూ ప్రతినిధులు, సభ్యులు రెండు రోజుల పాటు సమావేశాలకు హాజరవుతారని తెలిపారు. వారికి భోజనం, వసతి, సమావేశ ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని సూచించారు. దీనికి ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసి మహాసభలు పూర్తయ్యే వరకు సమన్వయంతో పనిచేయాలని కోరారు. పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకరి భిక్షంగౌడ్‌ మాట్లాడుతూ.. పీఆర్టీయూ చరిత్రలో రాష్ట్ర కౌన్సిల్‌ సమావేశాలను నల్లగొండ జిల్లాలో నిర్వహించే అవకాశం తొలిసారి లభించడం సంతోషకరమన్నారు. అనంతరం నూతన కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించి వారికి నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌ కోమటిరెడ్డి నర్సింహారెడ్డి, రాష్ట్ర ఆడిట్‌ కమిటీ చైర్మన్‌ సోమిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల జానారెడ్డి, జిల్లా మాజీ అధ్యక్షుడు ఫణికుమార్‌, మాజీ ప్రధాన కార్యదర్శి బసిరెడ్డి రవీందర్‌రెడ్డి, జిల్లా అసోసియేట్‌ అధ్యక్షుడు కిరణ్‌కుమార్‌, గాదె వెంకట్‌రెడ్డి, నామిరెడ్డి మహేందర్‌రెడ్డి, వీరమల్ల శ్రీనివాస్‌, యూసుఫ్‌పాషా, బత్తుల భాస్కర్‌, సూదిరెడ్డి రవీందర్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, గుర్రం రవి పాల్గొన్నారు.

ఫ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement