భువనగిరిటౌన్ : జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ ఎన్నికలు ఉత్కంఠభరితంగా ముగిశాయి. 15 డైరెక్టర్ పదవులకు 22 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. పోలింగ్ అనంతరం చేపట్టిన ఓట్ల లెక్కింపు రాత్రి పొద్దుపోయే వరకు కొనసాగింది. అత్యధిక ఓట్లు పొందిన మొదటి 15 మంది డైరెక్టర్లుగా విజయం సాధించినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.
అధిక ఓట్లు సాధించిన వారు
అభ్యర్థుల్లో ఇ.లావణ్య అత్యధికంగా 1,228 ఓట్లు సాధించి మొదటి స్థానంలో నిలిచారు. డాక్టర్ ఎ.అనిల్ కుమార్ (1,185), డి.బాలాజీ (1,180), కుకుట్ల చంద్రశేఖర్ (1,175), సద్ది వెంకట్‌రెడ్డి (1,161), డాక్టర్ జి.లక్ష్మీనర్సింహారెడ్డి (1,125), సీహెచ్.సోమనరసింహాచారి (1,099), ఎమ్మడి రామచంద్రారెడ్డి (1,082), జె.అంజయ్య (1,077), ఇల్లెని రాంరెడ్డి (1,048), ఎం.అమరేందర్‌రెడ్డి (1,025), కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి (1,018), ఎంఏ.రహీమ్ (1,017), ఎం.వెంకటేశ్వర్రెడ్డి (985), పి.పూర్ణచందర్‌రాజు 966 ఓట్లు పొంది డైరెక్టర్లుగా ఎన్నికయ్యారు. ఎన్నికై న డైరెక్టర్లు త్వరలోనే సమావేశమై చైర్మన్, వైస్ చైర్మన్లను ఎన్నుకోనున్నారు. కౌంటింగ్ ప్రక్రియను అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు, డీపీఓ శ్రీనివాస్‌రెడ్డి పర్యవేక్షించారు.
రాయగిరి హైస్కూల్‌లో పోలింగ్
రాయగిరి జెడ్పీహెచ్‌ఎస్‌లో ఎనిమిది కేంద్రాల్లో పోలింగ్ ప్రక్రియ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగింది. మొత్తం 2,035 ఓట్లకు గాను 1,514 ఓట్లు పోలయ్యాయి. భువనగిరికి చెందిన ప్రైవేట్ ఉపాధ్యాయురాలు పద్మావతి తన ఓటు హక్కు వినియోగించుకోవడానికి కేంద్రానికి రాగా, అప్పటికే ఆమె పేరుతో గుర్తుతెలియని వ్యక్తులు ఓటు వేసేశారు. అధికారులు ఆమె ఓటు వేసేందుకు అవకాశం కల్పించలేదు. అధికారుల తీరు, అక్రమాలపై రాష్ట్ర గవర్నర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తామని బాధితురాలితోపాటు మరికొందరు ఓటర్లు పేర్కొన్నారు.
ఫ ప్రశాంతంగా ఎన్నికలు..
15 స్థానాలకు 22 మంది పోటీ
ఫ 2,035 ఓట్లకు పోలైనవి 1,514
ఫ రాత్రి వరకు కొనసాగిన ఓట్ల లెక్కింపు


