పీఎంశ్రీ బడుల్లో ప్రత్యేక బోధకులు | - | Sakshi
Sakshi News home page

పీఎంశ్రీ బడుల్లో ప్రత్యేక బోధకులు

Oct 5 2026 1:39 AM | Updated on Oct 5 2026 1:39 AM

9 వరకు దరఖాస్తులు చేసుకోవాలి

భువనగిరి : జిల్లాలో పీఎంశ్రీ పాఠశాలల్లో చదువుతున్న ప్రత్యేక అవసరాల గల విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన, సహాయక సేవలు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక అతిథి విద్యాబోధకులను నియమించనుంది. 2026 నవంబర్‌ నుంచి 2027 మార్చి వరకు ఐదు నెలల కాలానికి చేపట్టనున్న ఈ నియామకాల్లో ఒక్కొక్కరికి నెలకు రూ.16,500 వేతనం చెల్లించనున్నారు. జిల్లాలో మొత్తం 20 పీఎంశ్రీ పాఠశాలల్లో వీరిని నియమించనున్నారు. పీఎం శ్రీ పాఠశాలతో పాటు క్లస్టర్‌, మండల, కాంప్లెక్స్‌ పరిధిలోని ప్రత్యేక అవసరాల గల విద్యార్థులకు వీరు సేవలు అందించాల్సి ఉంటుంది. కంటి చూపు, వినికిడి, శారీరక వైకల్యం, మేధోపరమైన వైకల్యం తదితర సమస్యలు ఉన్న విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక బోధన అందించనున్నారు. ఇప్పటికే మండల కేంద్రాల్లోని భవిత సెంటర్ల ద్వారా ప్రత్యేక అవసరాల గల పిల్లలకు సేవలు అందుతున్నాయి. పీఎంశ్రీ పాఠశాలల్లో ప్రత్యేక విద్యా బోధకుల నియామకంతో వారికి మరిన్ని సేవల అందుబాటులోకి రానున్నాయి.

ఫ ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు బోధన, సహాయక సేవలకు..

ఫ ఐదు నెలలకు గాను నియామకం

ఫ ఒక్కొక్కరికి నెలకు

రూ.16,500 వేతనం

పీఎంశ్రీ స్కూళ్లలో ఐదు నెలలపాటు ప్రత్యేక అవసరాలు కలగిన చిన్నారులకు బోధించేందుకు ప్రత్యేక అతిథి విద్యాబోధకుల నియామకాలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. స్పెషల్‌ బీఈడీ, బీఈడీ జనరల్‌, స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ డిప్లామా, పీజీ డిప్లామా చేసిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 9వ తేదీలోపు సంబంధిత పీఎం శ్రీ పాఠశాలల్లో దరఖాస్తులు చేసుకోవాలి.

– భిక్షపతి, జిల్లా విద్యా శాఖ అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement