యాదగిరిగుట్ట: దుబాయ్ విమానంలో కో–పైలట్ దాడిలో గాయపడినప్పటికీ 174 మంది ప్రయాణికులను కాపాడిన భారతీయ కెప్టెన్ పైలట్ స్మిత్ మచ్చార్ ఆరోగ్యంగా ఉండాలని యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని వేడుకున్నట్లు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, కర్ణాటక సహ ప్రభారీ కాసం వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం యాదగిరీశుడిని దర్శించుకొని, వైకుంఠద్వారం వద్ద శ్రీస్వామి వారి పాదాల చెంత పైలట్ స్మిత్ మచ్చార్ ఆరోగ్యంగా ఆస్పత్రి నుంచి తిరిగి రావాలని కోరుతూ పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇండియన్ పైలట్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోకుండా మతాల ఆధారంగా కాంగ్రెస్ రాజకీయాలు చేస్తోందన్నారు. కాంగ్రెస్ గతంలో ఎస్ఐఆర్ నిర్వహిస్తే లేని తప్పుడు ఇప్పుడు ఎలా అవుతుందో చెప్పాలన్నారు. అనంతరం పట్టణంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటు నమోదు ప్రక్రియను పరిశీలించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఉట్కూరి అశోక్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి కాధూరి అచ్చయ్య, మాజీ అధ్యక్షులు పాశం భాస్కర్, జిల్లా కార్యదర్శి కృష్ణ, నాయకులు మాయ దశరథ, కర్రె మాధవి, బోడ రాధ, కర్రె ప్రవీణ్, జి.మహేశ్వరి సత్యం, దయ్యాల కుమార్, రాజేందర్‌రెడ్డి, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.


