యాదగిరిగుట్ట: ఆలేరు నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి అవసరమైన నిధులు విడుదల చేయాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కోరారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసి విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గానికి సంబంధించిన పలు అభివృద్ధి, సంక్షేమ అంశాలను డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు ఐలయ్య వెల్లడించారు. అనంతరం రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి, రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని కలిశారు. ఆలేరు నియోజకవర్గ రైతులకు సాగు నీరు అందించాలనే లక్ష్యంతో పెండింగ్‌లో ఉన్న ప్యాకేజీ–15 కాలువ పనులను, ఇతర అభివృద్ధి పనులపై చర్చించారు. పనుల పూర్తికి కృషిచేస్తున్న మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం, మంత్రులను సన్మానించినట్టు పేర్కొన్నారు.
ఫ ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య వినతి


