భూదాన్‌పోచంపల్లి : బీబీనగర్ మండలం కొండమడుగు మెట్టు సమీపంలో ఇటీవల రైలు ప్రమాదంలో 350 గొర్రెలు మృతి చెంది నష్టపోయిన పోచంపల్లి మండలం అలీనగర్‌కు చెందిన గొర్రెల కాపరి బాలబోయిన కిష్టయ్య శనివారం గొర్రెల కాపరుల సంఘం ఆధ్వర్యంలో వెళ్లి హైదరాబాద్‌లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కలిశాడు. దీంతో మాజీ మంత్రి ఆయనను పరామర్శించి రూ.లక్ష ఆర్థికసాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో గొర్రెల కాపరుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గుండెబోయిన అయోద్య యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి సోమ రమేష్,నాయకులు గండు భిక్షపతి, జంగయ్య, జగదీశ్వర్ పాల్గొన్నారు.


