సూపర్‌ మార్కెట్‌లో ఫుడ్‌సేఫ్టీ తనిఖీలు | - | Sakshi
Sakshi News home page

సూపర్‌ మార్కెట్‌లో ఫుడ్‌సేఫ్టీ తనిఖీలు

Oct 3 2026 1:44 AM | Updated on Oct 3 2026 1:44 AM

భువనగిరిటౌన్‌ : భువనగిరి పట్టణంలోని ఓ రిటైల్‌ సూపర్‌ మార్కెట్‌లో అసిస్టెంట్‌ ఫుడ్‌ కంట్రోలర్‌ జ్యోతిర్మయి, డిజిగ్నేటెడ్‌ ఆఫీసర్‌ స్వాతి శుక్రవారం తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అపరిశుభ్రత, ఫంగస్‌ పట్టిన పండ్లు, కూరగాయలు, గడువు ముగిసిన ఉత్పత్తులను విక్రయిస్తున్నట్లు గుర్తించారు. దుర్వాసన వస్తున్న సుమారు రూ. 60 వేల విలువైన 118 కేజీల ఆహార పదార్థాలను ధ్వంసం చేశారు. మెడికల్‌ సర్టిఫికెట్లు లేకపోవడంతో పాటు నిబంధనలు ఉల్లంఘించినందుకు యాజమాన్యానికి ఇంప్రూవ్‌మెంట్‌ నోటీసు జారీ చేశారు. నిర్ణీత గడువులోగా లోపాలు సరిదిద్దకుంటే స్టోర్‌ ఫుడ్‌ లైసెన్స్‌ రద్దు చేస్తామని హెచ్చరించారు.

భక్తులకు నాణ్యమైన ప్రసాదం అందించాలి

యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రానికి వచ్చే భక్తులకు నాణ్యమైన ప్రసాదం అందించాలని యాదాద్రి జోన్‌ అసిస్టెంట్‌ ఫుడ్‌ కంట్రోలర్‌ జ్యోతిర్మయి, జిల్లా ఆహార భద్రత నిర్దేషిత అధికారిణి (డీఎఫ్‌ఎస్‌డీఓ) స్వాతి సూచించారు. ఫుడ్‌ సేఫ్టీ లైసెన్స్‌ జారీ ప్రక్రియలో భాగంగా శుక్రవారం ప్రసాదాల తయారీ, ముడి పదార్థాల నిల్వ, తయారీ ప్రదేశాల పరిశుభ్రత, ప్రసాదం ప్యాకింగ్‌, భక్తులకు పంపిణీ చేసే విధానాలను వారు పరిశీలించారు. ఆహార భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటిస్తూ భక్తులకు నాణ్యమైన ప్రసాదం అందించాలని సూచించారు. అనంతరం ప్రసాదాల విభాగంలో పాటిస్తున్న నాణ్యతా ప్రమాణాలను పరిశీలించి ఈఓ భవాని శంకర్‌కు లైసెన్సు జారీ చేశారు.

వైభవంగా ఊంజల్‌ సేవ

యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఊంజల్‌ సేవోత్సవాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. శుక్రవారం ఆండాళ్‌ అమ్మవారికి ఇష్టమైన రోజు కావడంతో సాయంత్రం వేళ మండపంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం అమ్మవారిని ప్రత్యేక పల్లకిపై అధిష్టించి ఆలయ తిరు, మాఢ వీధుల్లో భక్తుల నడుమ ఊరేగించారు. అద్దాల మండపంలో ఆండాళ్‌ దేవిని అధిష్టించి ఊంజల్‌ సేవోత్సవం జరిపించారు. ఆయా పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఇక ఆలయంలో ఉదయం నుంచి రాత్రి వరకు సంప్రదాయ పూజలు కొనసాగాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement