ఆగని చలాన్ల బాదుడు | - | Sakshi
Sakshi News home page

ఆగని చలాన్ల బాదుడు

Oct 3 2026 1:44 AM | Updated on Oct 3 2026 1:44 AM

చౌటుప్పల్‌ : చౌటుప్పల్‌లో ఒకవైపు రోడ్డు నిర్మాణ పనులు కొనసాగుతుండటంతో ట్రాఫిక్‌ అస్తవ్యస్తంగా మారింది. ఏ వాహనం ఎటు నుంచి వస్తుందో తెలియని పరిస్థితి. ట్రాఫిక్‌ను నియంత్రించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాల్సిన పోలీసులు.. ఆ బాధ్యతను గాలికొదిలేశారు. కేవలం రోజుకు 150 చలాన్లు ఎలా వేయాలనే దానిపైనే పూర్తిగా దృష్టి సారించారు. ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ, ఎక్కడబడితే అక్కడ నిల్చుని ఫొటోలు తీస్తూ వాహనదారులను బెంబేలెత్తిస్తున్నారు.

టార్గెట్‌ పూర్తిచేయాలని..

ఇష్టానుసారంగా ఫొటోలు తీసి చలాన్లు వేసే విధానాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై బెదిరింపులకు పాల్పడుతున్నారని వాహనదారులు పేర్కొంటున్నారు. ‘మాకు ఇచ్చిన 150 చలాన్ల టార్గెట్‌ పూర్తి చేయాలి.. ఏ సమయంలో, ఎక్కడ నిలబడి ఫొటోలు తీయాలో మాకు చెప్పాల్సిన అవసరం లేదని పౌరులపై దబాయిస్తున్నారు. గురువారం సాయంత్రం తంగడపల్లి చౌరస్తా వద్ద జాతీయ రహదారిపై నిల్చొని ఇష్టానుసారంగా ఫొటోలు తీస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్‌ను అడిగినందుకు ఓ జర్నలిస్టుపై తీవ్ర దురుసుగా ప్రవర్తించారు. ‘నా డ్యూటీ నేను చేస్తున్నా.. ఏదైనా ఉంటే సీఎం వద్దకు వెళ్లి చెప్పుకో’.. అంటూ రుబాబు చేస్తున్నారని పలువురు వాహనదారులు పేర్కొంటున్నారు. ఈ విషయాన్ని ట్రాఫిక్‌ ఏసీపీ ప్రభాకర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా.. రద్దీ జంక్షన్ల వద్ద ఫొటోలు తీసే విషయమై సిబ్బందికి తగిన సూచనలు చేసి, సమయపాలన పాటించేలా చూస్తానని తెలిపారు.

ఫ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న

ట్రాఫిక్‌ సిబ్బంది

ఫ రద్దీ సమయాల్లో జంక్షన్ల వద్ద

మాటువేసి ఫొటోలు

తప్పించుకునే క్రమంలో ప్రమాదాలు

అత్యంత రద్దీగా ఉండే సమయాల్లోనే ట్రాఫిక్‌ సిబ్బంది రోడ్లపైకి వస్తున్నారు. పోలీసులు ఫొటోలు తీస్తున్న విషయాన్ని గమనించిన ద్విచక్ర వాహనదారులు.. ఆ చలాన్ల నుంచి తప్పించుకునేందుకు ఆకస్మికంగా బ్రేకులు వేయడం, రాంగ్‌ రూట్‌లో వెళ్లడం వంటి ప్రయత్నాలు చేస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు. పోలీసులు మాత్రం అవేమీ పట్టించుకోకుండా కేవలం తమ టార్గెట్లు పూర్తి చేసుకోవడంపైనే పనిచేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement