ముందస్తు ప్రణాళిక రూపొందించాలి | - | Sakshi
Sakshi News home page

ముందస్తు ప్రణాళిక రూపొందించాలి

Oct 3 2026 1:44 AM | Updated on Oct 3 2026 1:44 AM

భువనగిరి: కూలీలకు జూన్‌ 2027 వరకు నిరంతరం ఉపాధి కల్పించేలా ముందస్తు సమగ్ర ప్రణాళికలను రూపొందించాలని భారత ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ డైరెక్టర్‌ శివశంకర్‌ అన్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం భువనగిరి మండలంలోని తాజ్‌పూర్‌ గ్రామంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గ్రామ సభకు హాజరై మాట్లాడారు. గ్రామంలోని సహజ వనరులు, భౌగోళిక పరిస్థితులు, ప్రజల అవసరాలను పరిగణనలోకి తీసుకుని సోషల్‌ మ్యాప్‌, రిసోర్స్‌ మాప్‌లను రూపొందించి అవసరమైన పనులను శాసీ్త్రయంగా గుర్తించాలన్నారు. గ్రామ అవసరాలకు అనుగుణంగా ఇంకుడు గుంతలు, ఫామ్‌పాండ్లు, కమ్యూనిటీ సోక్‌ పిట్లు, రెయిన్‌ వాటర్‌ హార్వెస్టర్‌ పిట్లు, చెక్‌ డ్యామ్‌ల వంటి భూగర్భ జలాల పెంపు పనులను గుర్తించి గ్రామ సభ ఆమోదంతో వీబీరామ్‌జీ ప్రణాళికలో చేర్చాలన్నారు. అనంతరం కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి మాట్లాడుతూ.. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వర్షాధార పంటలపై ఆధార పడకుండా పంటల మార్పిడి విధానాన్ని అవలంబించాలన్నారు. అనంతరం వీబీ రామ్‌జీ కార్యక్రమ లక్ష్యాలు, గ్రామీణ ఉపాధి అవకాశాలు, నీటి సంరక్షణ, సహజ వనరుల అభివృద్ధి, గ్రామాభివృద్ధి ప్రణాళిక తయారీ విధానంపై అవగాహన కల్పించారు. అంతకు ముందు గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గ్రామ సర్పంచ్‌ ర్యాకల సంతోషశ్రీనివాస్‌ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో గ్రామీఽణాభివృద్ధి శాఖ అధికారి శ్రీకిరణ్‌ చరణ్‌పాండే, తెలంగాణ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక అధికారి శ్రీలక్ష్మీ, వీబీ రామ్‌జీ జాయింట్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌, డిప్యూటీ కమిషనర్‌ శేషుకుమార్‌, టీజీ ఎస్‌బీఎం డైరెక్టర్‌ సురేష్‌బాబు, అడిషనల్‌ డీఆర్‌డీఓ సురేష్‌, డీపీఓ శ్రీనివాస్‌రెడ్డి, జెడ్పీ డిప్యూ టీ సీఈఓ శ్రీనివాస్‌, ఎంపీడీఓ విజయలక్ష్మి, ఎంపీఓ దినకర్‌, సామాజిక వేత్త శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

ఫ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ

డైరెక్టర్‌ శివశంకర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement