పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు | - | Sakshi
Sakshi News home page

పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు

Oct 1 2026 9:39 AM | Updated on Oct 1 2026 9:39 AM

● జూదరుల అరెస్ట్‌ ● నగదు, వాహనాలు, సెల్‌ఫోన్లు స్వాధీనం

భువనగిరి : మండలంలోని వడాయిగూడెం గ్రామ పరిధిలోని ఓ లాడ్జిలో మంగళవారం రాత్రి కొందరు వ్యక్తులు పేకాట ఆడుతున్నట్లు పక్కా సమాచారం అందడంతో భువనగిరి రూరల్‌ ఎస్‌హెచ్‌ఓ అనిల్‌కుమార్‌ ఆధ్వర్యంలో పోలీసులు దాడి చేసి 17 మందిని అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురు పరారయ్యారు. వారి నుంచి రూ.39,970 నగదు, నాలుగు బైకులు, ఒక వ్యాన్‌, 12 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్‌హెచ్‌ఓ అనిల్‌కుమార్‌ తెలిపారు.

బీబీనగర్‌లో..

బీబీనగర్‌ శివారులోని ఇందిరమ్మ కాలనీ వద్ద మామిడితోటలో పేకాట ఆడుతున్నట్లు అందిన సమాచారం మేరకు బీబీనగర్‌ పోలీసులు, భువనగిరి ఎస్‌ఓటీ పోలీసులు దాడి చేసి 17 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.3,53,740 నగదు, 19 సెల్‌ ఫోన్లు, 3 కార్లు, 2 బైకులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు సీఐ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు.

పత్తి లారీ బోల్తా.. క్లీనర్‌కు గాయాలు

దేవరకొండ : పత్తి బేళ్లతో వెళ్తున్న లారీ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. ఈ ఘటన దేవరకొండ పట్టణంలో బుధవారం తెల్లవారుజామున జరిగింది. ఏపీలోని కర్నూలు జిల్లా ఆదోని నుంచి పత్తి బేళ్లతో కోల్‌కతాకు వెళ్తున్న లారీ దేవరకొండ పట్టణంలోని వెంకటేశ్వర థియేటర్‌ సమీపంలో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. ఈ ఘటనలో క్లీనర్‌ మంజునాఽథ్‌కు స్వల్ప గాయాలయ్యాయి. లారీ డివైడర్‌ను ఢీకొట్టడంతో విద్యుత్‌ తీగలు, చెట్ల కొమ్మలు తెగిపడ్డాయి. లారీ రోడ్డుకు అడ్డంగా పడడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. స్థానిక కౌన్సిలర్‌ సుమలత మున్సిపల్‌ కార్మికుల సహాయంతో చెట్ల కొమ్మలు, విద్యుత్‌ తీగలు తొలగించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు సీఐ వెంకట్‌రెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement