సింగపూర్‌లో పరిశుభ్రతకు ప్రాధాన్యం | - | Sakshi
Sakshi News home page

సింగపూర్‌లో పరిశుభ్రతకు ప్రాధాన్యం

Oct 1 2026 9:39 AM | Updated on Oct 1 2026 9:39 AM

సింగపూర్‌

తిరుమలగిరి(తుంగతుర్తి) : సింగపూర్‌లోని విద్యాలయాల్లో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. ప్రభుత్వ విద్యాలయాలు కార్పొరేట్‌ స్థాయిలో కనిపిస్తాయి. విద్యార్థులకు ప్రాథమిక స్థాయి నుంచే ఆటలు, నైతిక విలువల పెంపుదలకు తరగతులు నిర్వహిస్తారు. ఎవరి పనిని వారు చేసుకునేలా చిన్నప్పటి నుంచే ప్రోత్సహిస్తారు. ఒకటి నుంచి ఆరు సంవత్సరాల వరకు ప్రైమరీ, ఏడు సంవత్సరాలకు ఫస్ట్‌ క్లాస్‌ ప్రారంభమవుతుంది. ఉపాధ్యాయులు, పోషకులు, సమాజం ఎవరి పాత్రను వారు ఆదర్శంగా నిర్వహిస్తారు. ప్రతిఒక్కరూ జవాబుదారీతనంతో ఉంటారు. అందుకే అక్కడ విద్యతో ముడిపడి ఉన్న ఏ చోటా బాధ్యతారాహిత్యం కనిపించదు. తరగతి గదుల్లో విద్యార్థులందరికీ ట్యాబ్‌ల ద్వారా విద్య బోధన జరుగుతుంది. ఉదయం ఏడున్నర నుంచి మధ్యాహ్నం ఒకటిన్నర వరకు పాఠశాల ఉంటుంది. ఆటపాటల ద్వారా విద్యాబోధన జరుగుతుంది. విద్యార్థులకు కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ ఎక్కువ నేర్పుతారు. సింగపూర్‌లో ఇంగ్లిష్‌ తర్వాత మాతృభాషకు ప్రాధాన్యత ఉంటుంది. పెద్ద స్థాయిలో ఉన్న వారు సైతం ఆంగ్లంలో మాట్లాడేందుకు ఇష్టపడతారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు చక్కని విద్యా విధానం అమల్లో ఉంది. – ఉప్పు మంగతాయి,

ఉపాధ్యాయురాలు, ఎంపీపీఎస్‌ తొండ, తిరుమలగిరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement