ఐక్య కూటమి గౌరవ అధ్యక్షుడిగా ఐలయ్య | - | Sakshi
Sakshi News home page

ఐక్య కూటమి గౌరవ అధ్యక్షుడిగా ఐలయ్య

Oct 1 2026 9:33 AM | Updated on Oct 1 2026 9:33 AM

యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట డిపో ఆర్టీసీ కార్మికులు ఐఎన్‌టీయూసీ, టీడబ్ల్యూయూ, ఎస్‌డబ్ల్యూఎఫ్‌ ఐక్య కూటమి గౌరవ అధ్యక్షుడిగా ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బుధవారం ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్యను కలిసిన ఐక్య కూటమి కార్మికులు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. డిపో కార్యదర్శిగా గున్న ప్రభాకర్‌, గ్యారేజీ కార్యదర్శిగా నర్సింగ్‌రావ్‌, అధ్యక్షుడిగా ప్రవీణ్‌, సలహాదారులుగా ఏఆర్‌రెడ్డి, ఎన్‌.ఎల్లయ్య, ఉపాధ్యక్షుడిగా వై.స్వామి, ఎస్‌డబ్ల్యూఎఫ్‌ కార్యదర్శులుగా మార్త కృష్ణ, యాదప్ప, అడిషనల్‌ కార్యదర్శిగా జంగయ్య, రీజినల్‌ మెంబర్‌గా అనంతల శ్రీనివాస్‌, గ్యారేజీ సహాయ కార్యదర్శిగా బి.రాము, కోశాధికారిగా సత్తయ్య, మహిళా కార్యదర్శిగా లక్ష్మీబాయి, ఉపాధ్యక్షులుగా రమణ, పారిజాత, పుష్పలత, సుజాతలను ఎన్నుకున్నారు.

భూ సమస్యల పరిష్కారానికి సర్వే దోహదం

రామన్నపేట: భూ సమస్యల పరిష్కారానికి సర్వే దోహద పడుతుందని అదనపు కలెక్టర్‌ వెంకారెడ్డి పేర్కొన్నారు.బుధవారం రామన్నపేట మండలంలోని నిధానపల్లిలో ప్రయోగాత్మకంగా చేపట్టిన భూ సర్వే పనులను పరిశీలించి మాట్లాడారు. భూ సర్వేకు రైతులు సహకరించాలని కోరారు. రైతులకు భూధార్‌ కార్డులను అందజేస్తారని తెలిపారు. ఆయన వెంట తహసీల్దార్‌ సి.లాల్‌బహదూర్‌శాస్త్రి, ఆర్‌ఐ శోభ, మాజీ సర్పంచ్‌ గుత్తా నర్సింహారెడ్డి, సర్వే సిబ్బంది ఉన్నారు.

సోషల్‌ జస్టిస్‌ కమిషన్‌ చైర్మన్‌గా మల్లికార్జున్‌

ఆత్మకూరు(ఎం): ఆత్మకూరు(ఎం) మండలం కొరటికల్‌ గ్రామానికి చెందిన ఎన్‌. మల్లికార్జున్‌ నేషనల్‌ హ్యూమన్‌ రైట్స్‌ అండ్‌ సోషల్‌ జస్టిస్‌ కమిషన్‌ రాష్ట్ర చైర్మన్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు కమిషన్‌ జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ మొహతాబ్‌రే బుధవారం నియామక ఉత్తర్వులు అందజేశారు. ఈ సందర్భంగా మల్లికార్జున్‌ మాట్లాడుతూ ప్రజలకు మానవ హక్కులపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటానన్నారు.

నేటి నుంచి ఎస్‌ఏ–1

భువనగిరి: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 1నుంచి 10 వ తరగతి చదువుతున్న విద్యార్థులకు సమ్మెటివ్‌ అసెస్‌మెంట్‌(ఎస్‌ఏ)–1 గురువారం నుంచి ఈ నెల 9 వరకు నిర్వహించనున్నారు.

జిల్లాలో 871 పాఠశాలలు

జిల్లా వ్యాప్తంగా ప్రాథమిక, ప్రాథమికోన్నత, జిల్లాపరిషత్‌, ప్రభుత్వ, ప్రైవేట్‌ కలిపి 871 స్కూళ్లు ఉన్నా యి. వీటిలో మొత్తం 78,231 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరికి ఎస్‌ఏ–1 నిర్వహించనున్నారు.

పాత పద్ధతిలోనే మూల్యాంకనం?

ఇప్పటి వరకు ఆయా పాఠశాలల్లోనే సబ్జెక్టుల టీచర్లు పరీక్షల సమాధాన పత్రాలను మూల్యాంకనం చేసేవారు. కానీ ఈ సారి జవాబు పత్రాలను మరొక పాఠశాలకు తరలించి అక్కడి ఉపాధ్యాయులచే మూల్యాంకనం చేయించాలని విద్యాశాఖ నిర్ణయించింది. కానీ ఈ విధానం అమలుపై ఇప్పటి వరకు ఎలాంటి ఆదేశాలు రాలేదు. దీంతో జవాబు పత్రాల మూల్యాంకనం పాత పద్ధతిలోనే కొనసాగుతుందని భావిస్తున్నారు. పరీక్షలు ముగిసిన మరుసటి రోజు అంటే ఈనెల 10 నుంచి 22 వరకు దసరా సెలవులు ఇవ్వనున్నారు. 23న స్కూళ్లు పునః ప్రారంభం కానున్నాయి.

ఎంఎల్‌హెచ్‌పీ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

భువనగిరి: జిల్లాలో ఖాళీగా ఉన్న 12 ఎంఎల్‌హెచ్‌పీ(మిడ్‌లెవల్‌హెల్త్‌ ప్రొవైడర్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తు చేసుకోవాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ మనోహర్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు ఎంబీబీఎస్‌, బీఏఎంఎస్‌ లేదా స్టాప్‌నర్స్‌ అర్హత కలిగి ఉండాలని పేర్కొన్నారు. ఎంపికై న ఎంబీబీఎస్‌ అర్హత కలిగినవారికి నెలకు రూ.40వేలు, స్టాఫ్‌నర్స్‌ అభ్యర్థులకు రూ. 29,900 వేతనం చెల్లించనున్నట్లు వివరించారు. ఈ నెల 5వ తేదీవరకు దరఖాస్తులు అందజేయాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement