దసరాకు ముందు చేనేత ఎక్స్‌పో | - | Sakshi
Sakshi News home page

దసరాకు ముందు చేనేత ఎక్స్‌పో

Oct 1 2026 9:33 AM | Updated on Oct 1 2026 9:33 AM

భూదాన్‌పోచంపల్లి: చేనేత కార్మికులకు మెరుగైన ఉపాధి కల్పించడమే లక్ష్యంగా దసరా పండుగకు ముందు పోచంపల్లిలో థ్రెడ్‌ పోచంపల్లి పేరిట చేనేత ఎక్స్‌పో ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి వెల్లడించారు. బుధవారం పోచంపల్లిలో మున్సిపల్‌ చైర్మన్‌ తడక వెంకటేశ్వర్లు, చేనేత సహకార సంఘం అధ్యక్షుడు భారత లవకుమార్‌, టూరిస్ట్‌ అండ్‌ క్రియేటివ్‌ ఎకానమీ డెవలప్‌మెంట్‌ కన్సల్టెన్సీ ప్రతినిధులు సాహితీ, శ్రీనివాస్‌, స్థానిక చేనేత కార్మికులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. థ్రెడ్‌ పోచంపల్లి ట్యాగ్‌లైన్‌ పై సొంతంగా వెబ్‌సైట్‌ రూపొందించుకొని వస్త్ర వ్యాపారాన్ని చేపట్టాలని సూచించారు. ఇక్కత్‌ అంటే కేవలం చీరలకు పరిమితం కాకుండా ఫర్నిషింగ్‌, ఇతర వైరెటీ ఉత్పత్తులను రూపొందించాలని సూచించారు. ఇక్కత్‌ డిజైన్‌ కలిగిన క్యాలెండర్‌, డైరీ, గిఫ్ట్‌లను తయారు చేయాలని చేనేత సహకార సంఘం నాయకులను కోరారు. పోచంపల్లిలో డిజైనింగ్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తామని ఓ సంస్థతో కూడ ఎంఓయూ జరిగిందన్నారు. కస్టమర్లకు నాణ్యమైన వస్త్రాలనే నమ్మకం కలిగించేందుకు చేనేత సహకార సంఘానికి క్యూర్‌ కోడ్‌ అమలు చేస్తున్నామని చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా చేనేత జౌళిశాఖ ఏడీ శ్రీనివాసరావు, తహసీల్దార్‌ శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ అంజన్‌రెడ్డి, చేనేత నాయకులు తదితరులు పాల్గొన్నారు.

రీ సర్వే, ఎస్‌ఐఆర్‌

ప్రక్రియలను వేగవంతం చేయండి

సాక్షి, యాదాద్రి : జిల్లాలో భూ రీ–సర్వే, ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో రెవెన్యూ అదనపు కలెక్టర్‌ వెంకారెడ్డితో కలిసి జిల్లాలోని ఆర్డీఓలు, తహసీల్దార్లతో రీసర్వే, ఎస్‌ఐఆర్‌ పనుల పురోగతిపై కలెక్టర్‌ సమీక్షించి మాట్లాడారు. రీ–సర్వే, ఎస్‌ఐఆర్‌ ప్రక్రియల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వొద్దని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జయమ్మ, ఆర్డీఓ శేఖర్‌ రెడ్డి, తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

ఫ కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement