ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలి

Jul 29 2026 2:16 AM | Updated on Jul 29 2026 2:16 AM

ఆలేరు రూరల్‌ : మారిన వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వరి సాగుకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి రైతులకు సూచించారు. మంగళవారం ఆలేరు మండలం కొలనుపాక రైతు వేదికలో రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రత్యామ్నాయ పంటల సాగుతో నీటి వినియోగాన్ని తగ్గించడంతో పాటు రైతులకు మెరుగైన ఆదాయం వచ్చేలా వ్యవసాయ శాఖ అధికారులు అవసరమైన సాంకేతిక సూచనలు, మార్కెట్‌ సమాచారం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జొన్నలు, పెసలు, మినుములు, కంది, ఆముదం వంటి పంటలపై దృష్టి సారించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వెంకట రమణారెడ్డి, తహసీల్దార్‌ ఆంజనేయులు, సర్పంచ్‌ బెదరబోయిన యాకమ్మ, మండల అధికారులు, రైతులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

ఫ కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement