ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలి

Jul 29 2026 2:16 AM | Updated on Jul 29 2026 2:16 AM

ఆలేరు రూరల్‌ : ప్రతి ఇంటికీ ఇంకుడు గుంత ఏర్పాటు చేసుకోవాలని అడిషనల్‌ కలెక్టర్‌ భాస్కర్‌రావు అన్నారు. మంగళవారం ఆలేరు ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మండల సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను సంరక్షించుకోవాలని, అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు. ప్రతి పొలంలోనూ పంట కుంట నిర్మించుకోవాలన్నారు. గ్రామాల్లో బోర్‌వెల్‌ రీచార్జ్‌ పిట్స్‌, కమ్యూనిటీ సోక్‌ పిట్స్‌ నిర్మించుకోవాలని సర్పంచ్‌లను కోరారు. ప్రతి ఇంటిపై సోలార్‌ ప్యానెల్స్‌ ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నందున, రైతులు ఆరుతడి పంటలపై దృష్టి సారించాలని సూచించారు. కార్యక్రమంలో క్లస్టర్‌ స్పెషల్‌ ఆఫీసర్‌, డీపీఓ శ్రీనివాస్‌రెడ్డి, మండల స్పెషల్‌ ఆఫీసర్‌ వెంకటరమణారెడ్డి, సర్పంచ్‌లు జూకంటి అనిల్‌, పరిదె మమత సంతోష్‌, మొగులుగాని నర్సయ్య, బోరిలాల్‌, పసుల సతీష్‌రెడ్డి, వడ్ల శోభన్‌బాబు, కంతి మధు, కుమారస్వామి, ఎసీరెడ్డి మంజూలమహేందర్‌రెడ్డి, జనగాం సుధారాణి, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

ఫ అడిషల్‌ కలెక్టర్‌ భాస్కర్‌రావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement