భువనగిరి మున్సిపల్‌ డీఈగా సాయిలక్ష్మి | - | Sakshi
Sakshi News home page

భువనగిరి మున్సిపల్‌ డీఈగా సాయిలక్ష్మి

Jul 29 2026 2:16 AM | Updated on Jul 29 2026 2:16 AM

భువనగిరిటౌన్‌ : భువనగిరి మున్సిపాలిటీ డిప్యూ టీ ఎగ్జిక్యూటీవ్‌ ఇంజినీర్‌ (డీఈ)గా సాయిలక్ష్మి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. కోదాడ మున్సి పల్‌ కార్యాలయంలో డీఈ గా పనిచేస్తున్న ఆమెను పబ్లిక్‌ హెల్త్‌ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ డిప్యుటేషనన్‌పై ఇక్కడికి బదిలీ చేశారు. ఇప్పటివరకు ఇక్కడ డీఈగా పనిచేసిన కొండలరావు సాధారణ బదిలీల్లో భాగంగా వికారాబాద్‌ మున్సిపాలిటీకి వెళ్లారు.

అవగాహనతో హెపటైటిస్‌ వ్యాధి నివారణ

భువనగిరి : అవగాహన కలిగి ఉండడం ద్వారా హెపటైటిస్‌ వ్యాధిని నివారించవచ్చని డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ మనోహర్‌ అన్నారు. మంగళవారం భువనగిరి పట్టణంలోని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో ప్రపంచ హెపటైటిస్‌ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. హెపటైటిస్‌ వ్యాధి నిర్ధారణ, చికిత్స, మందులను ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా అందజేస్తున్నట్లు తెలిపారు. అనంతరం నర్సింగ్‌ అధికారులకు హెపటైటిస్‌ టీకాలను అందజేశారు. అంతకుముందు 100 మందికి హెపటైటిస్‌ పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్‌ డాక్టర్‌ వంశీకృష్ణ, ఆర్‌ఎంఓ చక్రధర్‌, రాజేందర్‌, విజయ్‌పటేల్‌, మధురిమ, ఉదయశ్రీ, రామకృష్ణ, వీణ, నర్సింగ్‌ కళాశాల విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.

భువనగిరిలో 42.8 మి.మీ వర్షం

భువనగిరిటౌన్‌ : జిల్లా వ్యాప్తంగా మంగళవారం పలు మండలాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిశాయి. తెలంగాణ స్టేట్‌ డెవలప్‌మెంట్‌ ప్లానింగ్‌ సొసైటీ తెలిపిన వివరాల ప్రకారం జిల్లాలో అత్యధికంగా భువనగిరి మండలం హన్మాపూర్‌లో 42.8 మిల్లీమీటర్లు, భువనగిరి కలెక్టరేట్‌ వద్ద 40.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

వర్షపాతం వివరాలు (మిల్లీమీటర్లలో..)

భువనగిరి మండలంలో హన్మాపూర్‌ 42.8, కలెక్టరేట్‌ 40.0, మిల్లీమీటర్ల వర్షపాతం పడింది. బొమ్మలరామారం 25.5, ఆత్మకూర్‌ (ఎం) 24.0, బీబీనగర్‌ మండలంలో 18.3, నారాయణపూర్‌ 15.5 మిల్లీమీటర్లు కురిసింది. మోటకొండూరు 14.8, మోత్కూర్‌ 13.3, గుండాల మండలంలో 8.8 మిల్లీమీటర్లు, భూదాన్‌ పోచంపల్లి 8.3 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. ఆలేరు మండలంలో 6.8, చౌటుప్పల్‌ 5.8, తుర్కపల్లి 5.3 మిల్లీమీటర్లు, యాదగిరిగుట్టలో 5.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. వలిగొండ 3.5, రాజాపేట 3.3, రామన్నపేట మండలంలో 2.5, అడ్డగూడూర్‌ మండలంలో 1.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

ప్రభుత్వ పాఠశాలల్లో

నాణ్యమైన విద్య

బొమ్మలరామారం : ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య లభిస్తుందని డీఈఓ భిక్షపతి అన్నారు. బొమ్మలరామారం మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలను మంగళవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థుల రీడింగ్‌ స్కిల్స్‌ను పరిశీలించారు. గణితం, తెలుగు సబెక్ట్‌ల్లో పలువురు విద్యార్థులను ప్రశ్నలు అడిగారు. కార్యక్రమంలో ఎంఈఓ రోజారాణి, ఉపాధ్యాయులు పద్మ, నవనీత తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement