విద్యార్థి బరువు కంటే | - | Sakshi
Sakshi News home page

విద్యార్థి బరువు కంటే

Jul 24 2026 11:39 AM | Updated on Jul 24 2026 11:39 AM

విద్యార్థుల ఆరోగ్యం పై ప్రభావం

భువనగిరి: ఆడిపాడే వయసులో బడి సంచుల మోతతో చిన్నారులు కుంగిపోతున్నారు. విద్యార్థులపై పుస్తకాల భారం తగ్గించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న నో బ్యాగ్‌ డే నిబంధనలు జిల్లాలో అపహాస్యమవుతున్నాయి. ముఖ్యంగా ప్రైవేటు, సీబీఎస్‌ఈ స్కూళ్లలో పుస్తకాల మోతతో పిల్లలు రోజూ 5 నుంచి 8 కిలోల బరువు మోయాల్సి వస్తోంది. ఫలితంగా చిన్న వయసులోనే వెన్నెముక, మెడ నొప్పుల బారిన పడుతూ భవిష్యత్తులో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఎదుర్కొనే ప్రమాదంలో పడుతున్నారు.

సీబీఎస్‌ఈ, ప్రైవేటులోనూ..

జిల్లాలోని సీబీఎస్‌ఈ, స్టేట్‌ సిలబస్‌ ఉన్న ప్రైవేట్‌ పాఠశాలల్లో పరిస్థితి భిన్నంగా ఉంది. ప్రతి సబ్జెక్టుకు పాఠ్యపుస్తకాలు, క్లాస్‌వర్క్స్‌, హోంవర్క్‌, వర్క్‌బుక్‌, అసైన్‌బుక్‌, ప్రాక్టీస్‌ బుక్‌ పేరిట ఐదు నుంచి ఆరు పుస్తకాలను తీసుకురావాలని సూచిస్తున్నారు. దీంతో చిన్నారులు రోజూ 5 నుంచి 8 కిలోల వరకు బరువున్న బ్యాగులను మోయాల్సి వస్తోందని తల్లిదండ్రులు చెబుతున్నారు.

నెలలో ఒక రోజు అమలు లేదు

జాతీయ విద్యా ప్రణాళిక–2005, స్కూల్‌ బ్యాగ్‌–2020 విధానంలో పుస్తకాల సంచిపై స్పష్టమైన ఆదేశాలిచ్చారు. నెలలో ఒక రోజు పుస్తకాల సంచి నుంచి విముక్తి(నో బ్యాగ్‌డే) కల్పించాలని సూచించారు. రాష్ట్ర విద్యా శాఖ సైతం ఆమోదించింది. ప్రతి నెలా మూడో శనివారం అమలు చేయాలని నిర్ణయించినా జిల్లాలో ఎక్కడ ఆ ఊసేలేదు.

దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు

అధిక బరువు ఉన్న బ్యాగులను రోజూ మోయడంతో చిన్నారుల్లో మెడ, నడుము నొప్పితోపాటు వెన్నెముక పై ఒత్తిడి వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. చిన్న వయస్సులోనే శరీర భంగిమలో మార్పులు రావడంతో పాటు కండరాల పై అధిక ఒత్తిడి ఏర్పడి భవిష్యత్తులో దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారితీసే అవకాశం ఉంటుంది.

విద్యార్థులు అధిక పుస్తకాలతో కూడిన బ్యాగు మోయడం వారి వెన్ను పూస పై ప్రభావం చూపుతుంది. మోకాళ్ల నొప్పులు వస్తాయి. త్వరగా అలిసిపోతారు.చిన్నారుల వయస్సుకు అనుగుణంగానే బరువు మోయాలి. అంతకు మించి బరువు మోస్తే ఆరోగ్య సమస్యలు వస్తాయి.

– కిరణ్‌, ఎముకల వైద్య నిపుణుడు

ఫ అధిక బరువు గల పుస్తకాల సంచితో అనర్థాలు

ఫ పిల్లల ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం

ఫ పాఠశాలల్లో అమలుకు నోచని నోబ్యాగ్‌ డే

వివిధ విద్యా సంస్థల్లో తరగతుల వారీగా విద్యార్థులు

మోస్తున్న పుస్తకాల బరువు(కిలోల్లో)

తరగతి కేంద్రీయ సీబీఎస్‌ఈ ప్రైవేటు ప్రభుత్వ

1 2.4 3.8 3.5 1.8

2–5 4.5 5.8 8.0 5.0

6–8 6.4 6.7 7.2 5.6

9–10 8.5 7.2 8.2 6.5

తరగతుల ప్రకారం

ఉండాల్సిన

పుస్తకాల బరువు

(కిలోల్లో)

తరగతులు బరువు

1, 2 1.5 –2

3–5 2 –3

6, 7 4

9,8 4.5

10 5

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement