భోంగీర్‌ కాదు.. భువనగిరి | - | Sakshi
Sakshi News home page

భోంగీర్‌ కాదు.. భువనగిరి

Jul 24 2026 11:39 AM | Updated on Jul 24 2026 11:39 AM

గెజిట్‌ మార్పుకోసం కృషి చేయాలి రైల్వే, రవాణా శాఖల్లోనూ.. సీఎస్‌ దృష్టికి తీసుకెళ్తాం యూట్యూబర్ల ప్రభావం

సాక్షి, యాదాద్రి : చారిత్రక ప్రాశస్త్యం ఉన్న భువనగిరి పేరు తన అస్థిత్వాన్ని కోల్పోతోంది. కొందరి నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వ రికార్డులు, రైల్వే స్టేషన్లు, ఆర్టీసీ బస్సుల డిజిటల్‌ బోర్డులపై ‘భోనగిరి’, ‘భోంగీర్‌’ అని తప్పుగా రాస్తుండటంతో తీవ్ర గందరగోళం నెలకొంది. సోషల్‌ మీడియా ప్రభావంతో ఈ తప్పు మరింతగా ప్రచారమవుతూ అసలు పేరు కనుమరుగయ్యే ప్రమాదం ఏర్పడింది. దీనివల్ల భవిష్యత్తులో విద్యార్థులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌లో సాంకేతిక సమస్యలు వస్తాయని మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే గెజిట్‌లో అధికారికంగా భువనగిరిగా పేరును సవరించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ఏఐ అనువాదాలు..

డిజిటల్‌ బోర్డుల గందరగోళం

ఇటీవల వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, ఆర్టీసీ బస్సులు, డిజిటల్‌ సైన్‌ బోర్డులలో కృత్రిమ మేధ అనువాదాల వల్ల తీవ్ర తప్పిదాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ గెజిట్‌లో పాత ఆంగ్ల స్పెల్లింగ్‌ ఉందనే సాకుతో ఆర్టీసీ బస్సు బోర్డులపై ఏఐ ట్రాన్స్‌లేషన్‌ వాడటం వల్ల భోంగీర్ఙ్‌ అని అర్థం లేని పదాలు వస్తున్నాయి. మున్సిపాలిటీలు, ఎకై ్సజ్‌, పోలీస్‌, స్థానిక రెవెన్యూకార్యాలయాలు, ప్రైవేట్‌ పాఠశాలల ట్రాన్స్‌ఫర్‌ సర్టిఫికెట్ల వరకు ప్రతీ చోటా ఒకే ఊరికి వేర్వేరు స్పెల్లింగ్‌లతో కూడిన పేరు వాడటం పరిపాటిగా మారింది.

అధికారిక గెజిట్‌లో భోంగీర్‌ అనే ఇంగ్లీష్‌ రికార్డును భువనగిరి మార్చాలి. ముందుగా మున్సిపాలిటీ, జిల్లా పరిషత్‌ సమావేశాల్లో ఏకగ్రీవంగా తీర్మానాలు చేయాలి. ఈ తీర్మానాలను రాష్ట్ర ప్రభుత్వం, రెవెన్యూశాఖ ద్వారా కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు పంపాలి. రైల్వే స్టేషన్‌లలో పేరు మార్పునకు కేంద్ర అనుమతి అవసరం. గెజిట్‌ మారితే ఆధార్‌కార్డులు, గూగుల్‌ మ్యాప్స్‌, రైల్వేకోడ్‌లు అన్ని మారుతాయి. ఈ ప్రాంతం పూర్వ వైభవం చాటుకోవాలంటే భువనగిరి గా నమోదు కావాల్సిందే.

– శ్రీచంద్ర, చిత్రకారుడు, జర్నలిస్ట్‌

రైల్వే స్టేషన్‌ బోర్డులపై హిందీ, తెలుగులో భువనగిరి అని ఉన్నప్పటికీ, ఇంగ్లిష్‌లో వచ్చేసరికి భోంగీర్‌ అని దర్శనమిస్తోంది. ఆర్టీసీ డిపోలు, బస్సు బోర్డులపై కూడా తప్పుడు పేర్లే రాజ్యమేలుతున్నాయి. విదేశాలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగుల పాస్‌పోర్టులు, వీసాలు, సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌లో సాంకేతిక సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది.

– అశోక్‌

ఈ సాంకేతిక, చారిత్రక తప్పిదాన్ని సరిదిద్దాలని ఇటీవల కలెక్టర్‌ను కలసి విన్నవించాం. స్పందించిన కలెక్టర్‌.. త్వరలోనే అన్ని డిపార్ట్‌మెంట్లకు ఒక స్పష్టమైన సర్క్యులర్‌ జారీ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సమస్యను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దృష్టికి తీసుకెళ్తాం. భువనగిరి ఎంపీ ద్వారా పార్లమెంట్‌లో ప్రస్తావించి, కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ప్రధానంగా రైల్వే శాఖ రికార్డుల్లోనూ భువనగిరిగా మార్పులు తీసుకురావాలని కోరుతాం.

– గోట్టిపాముల బాబురావు, న్యాయవాది

యూట్యూబర్లు, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్లు గుట్టపైకి వచ్చి చేసే వీడియోలలో భువనగిరి కి బదులుగా భోంగీర్‌, భోనగిరి అని పలు రకాలుగా ప్రచారం చేస్తున్నారు. ఈ తప్పుడు పదం మరింత వైరల్‌ అవుతోంది. దీనివల్ల రాబోయే తరం, పాఠశాల విద్యార్థులు తమ సొంత ఊరి అసలు పేరునే మరిచిపోయే పరిస్థితి దాపురిచింది. చారిత్రక నేపథ్యం ఉన్న భువనగిరిని పేరును కాపాడుకోవాలిన అవసరం ఉంది.

– మెరుగు మధుసూదన్‌, బీడీఎఫ్‌,

ప్రభుత్వ రికార్డుల్లో ఇంగ్లిష్‌ స్పెల్లింగ్‌పై తీవ్ర గందరగోళం

ఫ అసలు పేరు స్థానంలో భోంగీర్‌, భోనగిరి

ఫ ఆర్టీసీ, రైల్వే స్టేషన్ల బోర్డుల్లోనూ తప్పులే

ఫ అస్థిత్వం కోల్పోతున్న చారిత్రక పేరు

ఫ గెజిట్‌లో సవరించాలని మేధావుల డిమాండ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement