సాక్షి, యాదాద్రి: హైదరాబాద్ –విజయవాడ జాతీయ రహదారి– 65 విస్తరణ పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్‌లో రోడ్ సేఫ్టీపై నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. హైదరాబాద్– విజయవాడ మార్గంలో ప్రమాదాలు నివారించాలన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జాతీయ రహదారుల వెంట భారీ వాహనాలు, ట్రక్కులు పార్కింగ్ చేయవద్దని సూచించారు. రోడ్డుపై ఆక్రమణలు జరగకుండా చూడాలని సూచించారు. టాస్క్ ఫోర్స్ టీంలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జిల్లాలో ప్రమాదాలకు గురయ్యే బ్లాక్ స్పాట్లను గుర్తించాలన్నారు. రహదారులపై అవసరమైన చోట హెచ్చరిక బోర్డులు, స్పీడ్ లిమిట్ బోర్డులు, రిఫ్లెక్టర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకారెడ్డి, అదనపు ఎస్పీ లక్ష్మీనారాయణ, ట్రాఫిక్ డీఎస్పీ ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.
మాదకద్రవ్యాల రవాణాపై నిరంతర నిఘా
మాదకద్రవ్యాల రవాణా, విక్రయం, వినియోగంపై నిరంతరం నిఘా ఉండాలని కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్‌లో కలెక్టర్ అధ్యక్షతన మత్తు పదార్థాల నిరోధక కమిటీ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో ఎకై ్సజ్ శాఖ ఆధ్వర్యంలో ఒకటి, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏడు కేసులు నమోదుచేశారన్నారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి,అదనపు ఎస్పీ లక్ష్మీ నారాయణ , అధికారులు పాల్గొన్నారు.
ఫ రోడ్ సేఫ్టీ సమావేశంలో కలెక్టర్ అనురాగ్ జయంతి


