మోటకొండూర్ : ఎల్‌నినో ప్రభావంతో రైతులు ప్రత్యామ్నాయంగా ఆయిల్‌పామ్ సాగు చేయడం ఎంతో శ్రేయస్కరం అని జిల్లా ఉద్యానవన శాఖ అధికారి స్రవంతి సూచించారు. బుధవారం మోటకొండూర్‌లోని రైతు పద్మారెడ్డి ఆయిల్ పామ్‌తోటను సందర్శించి రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఎకరం వరి సాగుకు ఉపయోగించే నీటితో 5 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేయవచ్చన్నారు. కార్యక్రమంలో ఆయిల్‌ఫెడ్ జిల్లా మేనేజర్ పి. ప్రవీణ్‌రెడ్డి, పద్మారెడ్డి, అంజిరెడ్డి, పన్నాల ప్రతాప్‌రెడ్డి, వెంకటేష్, నోముల నర్సిరెడ్డి, మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.


