ఆత్మకూరు(ఎం): ఆత్మకూరు(ఎం) మండలం రహీంఖాన్‌పేట నుంచి మోత్కూరుకు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా కప్రాయపల్లి స్టేజీ సమీపంలో రోడ్డు పక్కన చెట్టు కూలి తండ్రి, కూతురికి గాయాలయ్యాయి. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. రహీంఖాన్‌పేటకు చెందిన బండారు రాములు గ్రామ స్టేజీ వద్ద ఆర్టీసీ బస్సులు ఆపకపోవడంతో కుమార్తె దివ్యను శుక్రవారం ద్విచక్రవాహనంపై మోత్కూరు బస్టాండ్‌లో దింపిరావడానికి వెళ్తున్నాడు. సరిగ్గా అదే సమయంలో కప్రాయపల్లి స్టేజీ సమీపంలో చెట్టు కూలి వీరి వాహనంపై పడింది. దీంతో రాములుకు తీవ్రంగా గాయాలయ్యాయి, కుమార్తెకు స్వల్ప గాయాలయ్యాయి. అదే సమయంలో ఆత్మకూర్(ఎం) మండలం పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబు ల్‌గా పనిచేస్తున్న శ్రీను స్వగ్రామం కేతేపల్లికి పోయి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం గమనించి సర్పంచ్ కొంగరి యాదగిరికి సమాచారం ఇచ్చాడు. వారు అక్కడకు చేరుకుని స్థానికుల సాయంతో చెట్టును తొలగించి గాయపడ్డ బండారు రాములును, దివ్యను చికిత్స నిమిత్తం భువనగిరికి, అనంతరం మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలించారు.
● తండ్రి, కూతురికి గాయాలు


